Alert: బస్సులో విండ్ సీట్‌లో కూర్చుని చెయ్యి బయట పెట్టి ప్రయాణిస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త

|

Aug 14, 2021 | 4:31 PM

మాములుగా ఎవరైనా సరే.. బస్సు లేదా ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు విండో సీటుని ప్రిఫర్ చేస్తారు. బాగా గాలి తగలడంతో, ప్రకృతి...

Alert: బస్సులో విండ్ సీట్‌లో కూర్చుని చెయ్యి బయట పెట్టి ప్రయాణిస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త
Representative Image
Follow us on

మాములుగా ఎవరైనా సరే.. బస్సు లేదా ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు విండో సీటుని ప్రిఫర్ చేస్తారు. బాగా గాలి తగలడంతో, ప్రకృతి అందాలను కూడా చూడొచ్చనే ఇంటెన్షన్‌తో కిటికీ వైపు సీటును ఎంచుకుంటారు. అయితే విండో సీటులో కూర్చున్నవారు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. లేకపోతే ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తాజాగా కృష్ణాజిల్లా నందిగామలోని అశోక్ నగర్ జకరయ్య హోటల్ సమీపంలో అటువంటి ప్రమాదమే జరిగింది. ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి విండోలో చేయి పెట్టి ప్రయాణిస్తున్నాడు. పక్కన వెళ్తున్న స్కూల్ బస్సు.. వేగంగా అతని చేతులను తాకింది. దీంతో అతని చేతికి తీవ్రగాయమై రక్తస్రావం జరిగింది. హుటాహుటిన చేరుకున్న 108 సిబ్బంది.. బాధితుడిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చేయి విరిగినట్లు పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

 గూడవల్లి వద్ద మరో ప్రమాదం

విజయవాడ రూరల్ మండలం గూడవల్లి వద్ద చెన్నై-కోల్‌కతా నేషనల్ హవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటో ఎదురుగా వస్తున్న లారీ కిందకి దూసుకెళ్లింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గన్నవరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని..దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరులో  బైక్​ను ఢీ కొట్టిన బస్సు.. యువకుడు మృతి

బైక్‌పై వస్తున్న యువకుడిని అదే మార్గంలో వస్తున్న బస్సు వెనకనుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ యువకుడు అక్కడికక్కడే  మృతిచెందాడు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం వద్ద చిలకలూరి పేట – నరసరావుపేట మార్గంలో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని పిడుగురాళ్ళ మండలం కరాలపాడుకు చెందిన శంకల గోపి (30) గా గుర్తించారు.  నాదెండ్ల పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాదెండ్ల పోలీసులు తెలిపారు.

Also Read: 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. చిన్న క్లూ కూడా లేదు.. రంగంలోకి 700 మంది పోలీసులు.. ఫైనల్‌గా

57 ఏళ్లు నిండిన వారికి అలెర్ట్.. నెలాఖరు వరకు వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ