UP Accident: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్థరాత్రి పూట మృత్యువు ట్రక్కు రూపంలో దూసుకురావడంతో ఏకంగా 18 మంది మృతిచెందారు. ఈ మహా విషాదం యూపీలోని బరాబంకి వద్ద చోటు చేసుకుంది. మృతులంతా బిహార్‌కు చెందిన వారుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షత్రగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. హర్యానా నుంచి బిహార్ వెళుతోన్న డబుల్ డెక్కర్ బస్సు లక్నో – అయోధ్య జాతీయ రహదారి పక్కన ఆగింది. ఈ సమయంలోనే వెనకాల నుంచి వేగంగా వచ్చిన లారీ బస్సును ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ సంఘటన బుధవారం వేకువ జామున 1.30 గంటలకు చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగిన ప్రదేశంలో 11 మంది మరణించగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో 7 గురు మరణించారు. ఇక మరో 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను లక్నో ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో భయానక పరిస్థితులు కనిపించాయి. లారీ వేగంగా ఢీకొట్టడంతో మృత దేహాలు టైర్లు, సీట్ల కింద ఇరుక్కుపోయాయి. దీంతో మృతదేహాలను బస్సులో నుంచి తీయడానికి పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. బస్సులో ఏదో లోపం తలేత్తడంతో రోడ్డు పక్క ఆపి రిపేర్ చేస్తోన్న సమయంలో లారీ ఢీకొట్టిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై భారీగా వాహనాలు ఆగిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇక అర్థరాత్రి క్షతగ్రాత్రులు, మృతి చెందిన వారి బంధవుల ఆర్తనాదాలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
अपर पुलिस महानिदेशक, जोन लखनऊ @sn_sabat द्वारा जनपद बाराबंकी के थाना रामसनेहीघाट क्षेत्रान्तर्गत लखनऊ- अयोध्या राजमार्ग पर सड़क दुर्घटना के घटनास्थल एवं घायलों के उपचार हेतु जिला अस्पताल का भ्रमण किया गया सम्बन्धित को आवश्यक विधिक कार्यवाही हेतु निर्देशित किया गया। @Uppolice pic.twitter.com/sB3QWuijRx
— ADG Zone Lucknow (@adgzonelucknow) July 28, 2021
Also Read: Vegetable Price Today: టమాటా 50, పచ్చిమిర్చి ఏకంగా 60… ముట్టుకుంటే షాకే.. వామ్మో ఏంటీ ధరలు