Hyderabad: దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ పై నుంచి పడిపోయిన వ్యక్తి.. ప్రమాదమా.? ఆత్మహత్యాయత్నమా.?

|

Oct 01, 2021 | 6:35 AM

Hyderabad: హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణం జరిగింది. దిల్‌సుఖ్‌ నగర్‌ మెట్రో స్టేషన్‌ పై నుంచి ఓ వ్యక్తి కిందపడిపోయాడు. దీంతో ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విషయాన్ని..

Hyderabad: దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ పై నుంచి పడిపోయిన వ్యక్తి.. ప్రమాదమా.? ఆత్మహత్యాయత్నమా.?
Follow us on

Hyderabad: హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణం జరిగింది. దిల్‌సుఖ్‌ నగర్‌ మెట్రో స్టేషన్‌ పై నుంచి ఓ వ్యక్తి కిందపడిపోయాడు. దీంతో ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సమాచారం తెలసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరకున్నారు.

అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆ వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెట్రో స్టేషన్‌ పై నుంచి పడిన వ్యక్తి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. విచారణలో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఆ వ్యక్తి ప్రమాదావశాత్తు పడ్డాడా.? లేదా ఆత్మహత్యయత్నం చేశాడా.? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Telangana Crime: గ్రామ సర్పంచ్‌ను చెప్పుతో కొట్టిన ఉప సర్పంచ్.. అసలు విషయం తెలిసిన పోలీసుల షాక్!

Viral Video: ప్రాణాలు తీసిన అతివేగం… ఒళ్ళు గగ్గురుపొడిచే యాక్సిడెంట్.. వీడియో వైరల్

Viral Video: పార్కు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్‎లో మంటలు.. వైరలైన వీడియో