Andhra Pradesh: మిరప చేనులో ఘాటు వాసన.. వచ్చి చూస్తే తెలిసిందీ అసలు సంగతి..!

| Edited By: TV9 Telugu

Mar 01, 2024 | 3:11 PM

ఇదీ నిజంగా పుష్ప సీన్‌ను మించిన ఘటన.. అది రైతు వ్యవసాయ క్షేత్రం.. చూసే వారికి అది వరితో పాటు, కూరగాయలు పండిస్తునన్నట్లు కనిపిస్తోంది. అక్కడే వేసిన మిరప తోటలోకి వెళ్లి చూస్తే మాత్రం ఆ రైతు అసలు రంగుబయట పడింది. మిరప చేను మాటున గంజాయి సాగు చేస్తున్నాడు రైతు. పక్కా ప్లాన్‌తో నిర్వహించిన ఆపరేషన్‌లో అసలు యవ్వారం వెలుగులోకి వచ్చింది.

Andhra Pradesh: మిరప చేనులో ఘాటు వాసన.. వచ్చి చూస్తే తెలిసిందీ అసలు సంగతి..!
Cultivating Cannabis Ganja
Follow us on

ఇదీ నిజంగా పుష్ప సీన్‌ను మించిన ఘటన.. అది రైతు వ్యవసాయ క్షేత్రం.. చూసే వారికి అది వరితో పాటు, కూరగాయలు పండిస్తునన్నట్లు కనిపిస్తోంది. అక్కడే వేసిన మిరప తోటలోకి వెళ్లి చూస్తే మాత్రం ఆ రైతు అసలు రంగుబయట పడింది. మిరప చేను మాటున గంజాయి సాగు చేస్తున్నాడు రైతు. పక్కా ప్లాన్‌తో నిర్వహించిన ఆపరేషన్‌లో అసలు యవ్వారం వెలుగులోకి వచ్చింది.

వ్యవసాయంలో నష్టాలు వచ్చేటప్పుడు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు ఓ రైతుకు వేరేలా అర్థమైంది. ఇక వ్యవసాయం దండగ అనుకున్నాడో.. ఏమో..! గంజాయి సాగు చేస్తూ పండగ చేసుకుంటున్నాడు. శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం మందలపల్లి గ్రామంలో హనుమంతరాయప్ప అనే రైతు మిరప తోటలో గంజాయి సాగు మొదలుపెట్టాడు. హనుమంతరాయప్ప తన పొలంలో వక్క, మిరప తోట ముసుగులో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్న హనుమంతురాయప్ప బండారాన్ని తోటి రైతులే బయటపెట్టారు.

రోజూ మిరప చేనుకు వెళ్లి గంజాయి మొక్కలకు నీళ్లు పెడుతున్న హనుమంతరాయప్ప వ్యవహరశైలిపై అనుమానం వచ్చిన చుట్టుపక్కల రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు… పక్కా సమాచారంతో సెబ్ అధికారులు హనుమంత రాయప్ప గంజాయి సాగు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మిరప తోట మధ్యలో ఎవరికీ అనుమానం రాకుండా 13 గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు గుర్తించారు. రైతు హనుమంతరాయప్ప చేత 13 గంజాయి మొక్కలను పీకించి, అతనిపై కేసు నమోదు చేశారు సెబ్ అధికారులు. పత్తి, మిరప చేలలో అంతర్ పంటగా కందులు, మినుములు వేయడం చూశా. కానీ మిరప తోటలో అంతర్ పంటగా గంజాయి సాగడాన్ని ఇదేందయ్యా ఇది.. మేము ఎక్కడా చూడలేదు అంటున్నారు తోటి రైతులు. నిందితుడిని అరెస్ట్ చేసిన సెబ్ అధికారులు రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…