మహారాష్ట్రలోని సాంగ్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో మృతదేహాల కలకలం చోటుచేసుకుంది. సాంగ్లీ ప్రాంతంలోని అంబికానగర్‌లో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులంతా విషం తాగి మృతి చెందారు. జరిగిన ఘటనతో ఆ ప్రాంతమంతా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు ఈ ఘటనను ఆత్మహత్యగా అనుమానిస్తన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆదివారం రాత్రి అంబికానగర్‌లో విషం సేవించి ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మానిక్ వాన్‌మోర్, పోపట్ వాన్‌మోర్ అనే ఇద్దరు సోదరులు వారి కుటుంబ సభ్యులు సహా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. మృతుల్లో తల్లి, భార్య, పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం మృతదేహాలు లభ్యం కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న వారి పేర్లు పోపట్ యల్లప్ప వాన్‌మోర్ (వయస్సు 52), సంగీతా పోపట్ వాన్‌మోర్ (48), అర్చన పోపట్ వాన్‌మోర్ (30), శుభమ్ పోపట్ వాన్‌మోర్ (28), మానిక్ యల్లప్ప వాన్‌మోర్ (49), రేఖ మానిక్ వాన్‌మోర్ (45), ఆదిత్య మానిక్ వాన్మోర్ (15), అనితా మానిక్ వాన్మోర్ (28), అక్కాటై వాన్మోర్ (72).
స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కుటుంబీకులంతా ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ తొమ్మిది మృతదేహాలు బయటపడిన ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి