Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బాలిక సహా 8 మంది దుర్మరణం.. ఘటన స్థలానికి పోలీసులు..!

Road Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వాహనాలు అజాగ్రత్తగా, మద్యం సేవించి నడపడం, ఓవర్‌టెక్‌ చేయడం తదితర కారణాల వల్ల ప్రతి రోజు దేశంలో..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బాలిక సహా 8 మంది దుర్మరణం.. ఘటన స్థలానికి పోలీసులు..!
Road Accident

Updated on: Oct 22, 2021 | 11:35 AM

Road Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వాహనాలు అజాగ్రత్తగా, మద్యం సేవించి నడపడం, ఓవర్‌టెక్‌ చేయడం తదితర కారణాల వల్ల ప్రతి రోజు దేశంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హర్యానాలో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక సహా 8 మంది దుర్మరణం పాలయ్యారు. హర్యానాలోని జజ్జర్‌లో బద్లి పట్టణం సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఆగివున్న లారీని ఎర్టిగా వాహనం ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా ఎర్టిగా వాహనంలో వెళ్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బహదూర్‌గఢ్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

కాగా, దేశంలో ప్రతి రోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నా.. జరుగుతూనే ఉన్నాయి.

 

ఇవీ కూడా చదవండి:అనంతపురం జిల్లాలో దారుణం.. భార్య భర్తల మధ్య గొడవ.. మూడు నెలల చిన్నారిని చెరువులో పడేసిన తండ్రి..!

Vizag: ప్రేమను నిరాకరించిన యువతికి యువకుడి గిఫ్ట్… అందులో ఏముందో తెలిస్తే మైండ్ బ్లాంక్