Rape: 40 ఏళ్ల మహిళతో యువకుడి స్నేహం.. సహజీవనం చేయలంటూ ఒత్తిడి.. చివరికి..
చాలా మంది బయటకు ఒకలాగా.. లోపల మరొకలాగా ఉంటారు. సమయం వచ్చే వరకు తెలియదు వారు ఎటువంటి వారో.. ఇలానే ఓ వ్యక్తి ...
చాలా మంది బయటకు ఒకలాగా.. లోపల మరొకలాగా ఉంటారు. సమయం వచ్చే వరకు తెలియదు వారు ఎటువంటి వారో.. ఇలానే ఓ వ్యక్తి ఓ మహిళతో స్నేహం చేశాడు. తర్వాత ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఫోన్లలో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపారు. ఇలా ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆమెను ప్రేమిస్తున్నాని చెప్పాడు. చాలాసార్లు బయట కలవమని బలవంతం చేశాడు. మొదటగా ఆమె అంగీకరించలేదు.. కానీ అతడి ఒత్తడితో అతడి వద్దకు వెళ్లింది. ఆ తర్వాత ఏమైందంటే..?
రాజస్తాన్ జైపూర్‌కు చెందిన రాంనారాయణ్ ఓ 40 ఏళ్ల మహిళతో మొదట పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని తరుచూ ఫోన్ చేసేవాడు. వారి మధ్య ఫోన్ సంభాషణలు కొంత కాలం నడిచాయి. ఈ క్రమంలోనే అతడు ఆ మహిళను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. తనతో సహజీవనం చేయమని కోరాడు. ఈ విషయంలో ఆమెను చాలా ఒత్తిడి చేశాడు. చివరకు ఆమె అతడిని నమ్మి, సరేనని ఒప్పుకుంది.
ఓ రోజు రాంనారాయణ్ కల్వద్‌లో ఉన్న తన ఇంటికి ఆ మహిళను తీసుకుని వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అతని స్నేహితులకు ఫోన్ చేశారు. అక్కడ వారందరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత రాంనారాయణ్ మొదట ఆమెపై అత్యాచారం చేశాడు. అప్పుడు అతని స్నేహితులు కూడా ఆమెపై అత్యాచారానికి యత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో దాడిచేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు. తర్వాత ఆమెను అక్కడే వదిలిపెట్టి అతడు స్నేహితులతో పరారయ్యాడు. బాధిత మహిళ రాంనారాయణ్, అతడి స్నేహితులు తనపై అత్యాచారం చేశారని కల్వద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Read Also.. Sexual Harassment On Dog: 67 ఏళ్ల వయసులో పాడు బుద్ధి.. పెంపుడు కుక్కను వదలని వృద్ధుడు..