Road Accident: నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. సర్పంచ్ సహా భార్య, ఇద్దరు పిల్లలు దుర్మరణం..

Nalgonda Road Accident: నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్ లారీ ఢీకొని సర్పంచ్ సహా భార్య, ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. శుక్రవారం చిన్నారులతో శుభకార్యానికి బయలు దేరిన

Road Accident: నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. సర్పంచ్ సహా భార్య, ఇద్దరు పిల్లలు దుర్మరణం..
Road Accident

Updated on: Apr 02, 2021 | 10:44 PM

Nalgonda Road Accident: నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్ లారీ ఢీకొని సర్పంచ్ సహా భార్య, ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. శుక్రవారం చిన్నారులతో శుభకార్యానికి బయలు దేరిన ఆ కుటుంబం మార్గమధ్యలోనే.. విగతజీవులుగా మారడంతో తెప్పలమడుగు గ్రామంలో తీవ్రం విషాదం నెలకొంది. ఈ సంఘటన జిల్లాలోని నిడమనూరులో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు.. తెప్పలమడుగు గ్రామానికి చెందిన సర్పంచ్ సహా భార్య ఇద్దరు పిల్లలు.. శుభకార్యం ఉండటంతో ముప్పరానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడ నుంచి బియ్యం లోడుతో వస్తున్న ఓ లారీ.. నిడమనూరు వద్ద పుచ్చకాయల లోడుతో వస్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని ఢీ కొట్టింది. లారీ బలంగా ఢీకొట్టడంతో.. టాటా ఏస్‌ వాహనం వెనుకనే వస్తున్న ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వస్తున్న తెప్పలమడుగు గ్రామ సర్పంచ్‌ తరి శ్రీనివాస్‌ (34), ఆయన భార్య విజయ (30) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వారి వెంట ఉన్న కుమార్తె శ్రీవిద్య (5), కుమారుడు కన్నయ్య (3)కు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు వారిని హుటాహుటిన మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారులు మృతి చెందారు. కాగా.. టాటా ఏస్‌ వాహనంలో ఉన్న వారిలో మరో ముగ్గురు గాయపడగా వారిని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Road accident : ఓవర్ టర్న్ చేయబోయి పక్కన వెళ్తోన్న కారుపై పడ్డ మార్బుల్స్ లోడు లారీ, కారులో ఉన్న నలుగురూ స్పాట్ డెడ్

Rakesh Tikait: బీకేయూ నేత రాకేశ్ తికాయత్ కాన్వాయ్‌పై దాడి.. నలుగురు అరెస్ట్.. ఘాజీపూర్‌లో రైతుల ఆందోళన