Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు యువకుల దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన థానే జిల్లాలో..

Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు యువకుల దుర్మరణం

Updated on: Feb 01, 2021 | 5:18 PM

4 killed in road accident maharastra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన థానే జిల్లాలో కొంగావ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పింప్లాస్‌ గ్రామ శివారులో ఆదివారం అర్థరాత్రి జరిగింది. ఆదివారం రాత్రి నాసిక్‌ నుంచి కారు ముంబైకి వెళుతోంది. ఈ క్రమంలో పింప్లాస్‌ గ్రామం సమీపానికి రాగానే.. అత్యధిక వేగంతో వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డు అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ముంబై నుంచి షిర్డీ వెళుతున్న ప్రైవేటు బస్సు.. కారును ఢికొంది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మరణించారని భివాండి పోలీసులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయిందని పోలీసులు వెల్లడించారు. మృతులను గోకుల్‌ గౌటే (29) పంకజ్‌ జ్వాలీ (29), కారు డ్రైవర్‌ జ్వాలా వీబీ సింగ్‌ (27), గౌరవ్‌ సుధీర్‌ సింగ్‌ (27)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను భీవండీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Budget 2021: ఈ బడ్జెట్‌తో పెద్ద కంపెనీలకే లాభం.. ప్రజల సమస్యలు పెరుగుతాయ్‌.. కేజ్రీవాల్‌ ట్విట్‌