కాటేసిన కల్తీ మద్యం.. నలుగురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం..

Illicit Liquor: కల్తీ మద్యం వారి జీవితాలను కాటేసింది. నాలుగు నిండు ప్రాణాలు బలి కాగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద సంఘటన

కాటేసిన కల్తీ మద్యం.. నలుగురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం..
illicit liquor

Edited By:

Updated on: Mar 22, 2021 | 10:10 AM

Illicit Liquor: కల్తీ మద్యం వారి జీవితాలను కాటేసింది. నాలుగు నిండు ప్రాణాలు బలి కాగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌ జిల్లా ఖోపా గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు శనివారం సాయంత్రం మద్యం సేవించారు. వారిలో ఒక వ్యక్తి కాసేపటికే తీవ్ర అవస్థతకు గురై మృతి చెందాడు. మరొకరు చికిత్స పొందుతూ ప్రైవేట్‌ ఆసుపత్రిలో మృతి చెందాడు.

ఈ క్రమంలో మరో నలుగురి పరిస్థితి విషమంగా మారిందని.. వెంటనే వారిని చికిత్స నిమిత్తం అలహాబాద్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో ఇద్దరు చనిపోవడంతో మృతుల సంఖ్య నలుగురికి చేరిందని పోలీసు అధికారి సత్యనారాయణ తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని పేర్కొన్నారు. గ్రామంలో మద్యం దుకాణం లేదని, దాదాపు 15 కిలోమీటర్ల దూరం నుంచి మద్యాన్ని తెచ్చుకున్నారని వెల్లడించారు.

మద్యం విక్రయించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని.. కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే సంఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌తోపాటు కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.

Also Read:

Students Drown: విషాదం నింపిన సరదా.. సముద్రంలో స్నానానికి వెళ్లి విద్యార్థుల గల్లంతు.. ఇద్దరు మృతి