విషాదం.. చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి.. నలుగురు పిల్లల మృత్యువాత

|

May 11, 2021 | 8:18 AM

4 children drown in pond: రాజస్థాన్‌లోని కురు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లలు మృత్యువాతపడ్డారు. పిల్లలందరూ

విషాదం.. చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి.. నలుగురు పిల్లల మృత్యువాత
drowning
Follow us on

4 children drown in pond: రాజస్థాన్‌లోని కురు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లలు మృత్యువాతపడ్డారు. పిల్లలందరూ 8 నుంచి 15 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన భలేరి ప్రాంతంలో జరిగిందని పోలీసులు వెల్లడించారు. నివాస ప్రాంతానికి చెరువు సమీపంలోనే ఉండటంతో ఆ పిల్లలందరూ స్నానం చేసేందుకు సరదాగా అక్కడకు వెళ్లారు. ఈ సంఘటన సోమవారం జరిగింది.

మొదట పిల్లలందరూ స్నానానికి చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ బాలుడు నీటిలో దిగి మునిగిపోయాడు. దీంతో మిగతా ముగ్గురు అతడిని రక్షించేందుకు వెళ్లి వారు కూడా నీటిలో మునిగిపోయారు. ఈ క్రమంలో నీటిలో తెలియాడుతున్న పిల్లల మృతదేహాలను చూసిన వ్యక్తులు వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఘటన జరిగిన సమయంలో వారి తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారని పోలీసులు వెల్లడించారు.

పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబాలకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

Also Read:

Remdesivir: రెమిడెసివిర్ బ్లాక్ మార్కెట్.. హెటిరో మేనేజరే సూత్రధారి.. లక్షల్లో వ్యాపారం.. చెక్ పెట్టిన నల్లగొండ పోలీస్

Covid Patients: తెలంగాణలోకి వస్తున్న కోవిడ్ పేషేంట్స్‌పై కఠిన నిబంధనలు.. ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్ ఉంటేనే అనుమతి..!