Hyderabad: దుండిగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల మృతి..

|

Dec 12, 2021 | 9:07 AM

Road Accident: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగిఉన్న లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు యువకులు

Hyderabad: దుండిగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల మృతి..
Road Accident
Follow us on

Road Accident: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగిఉన్న లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బౌరంపేట కోకాకోలా కంపెనీ వద్ద జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువకులు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో కారును అతి వేగంగా నడుపుతూ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించారు.

మృతులను ఏలూరు, విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో చరణ్‌ది విజయవాడ కాగా.. సంజూ, గణేశ్‌లది ఏలూరు అని తెలిపారు. గాయపడిన అశోక్‌ ప్రస్తుతం సూరారంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో చరణ్‌ కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి మద్యం మత్తులో కారు అతివేగంగా నడపడమే కారణమని భావిస్తున్నారు. కాగా.. వీరంతా నిజాంపేట్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Watch Video: మొబైల్ షాప్‌లో గొడవ.. వేట కత్తితో రెచ్చిపోయిన ఉద్యోగి.. అసలేమైందో తెలుసా..? వీడియో

Visakhapatnam: విశాఖ ఆర్కే బీచ్‌లో కారు బీభత్సం.. మద్యం మత్తులో వాకర్స్‌పైకి..

Indian Railway: రైల్వే ఆదాయంలో 49 శాతం పెరుగుదల.. 8 నెలల్లో రూ.14184 కోట్ల ఆదాయం