Kashmiri Students Arrested: టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాపై పాకిస్తాన్ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే.. పాక్‌కు మద్దతు తెలుపుతూ దేశంలో పలుచోట్ల సంబరాలు జరిగాయి. ఈ సంఘటనలపై అందరి నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ గెలుపు అనంతరం సంబురాలు జరుపుకున్న ముగ్గురు విద్యార్థులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని రాజా బల్వంత్ సింగ్ కాలేజీలో చదువుతున్న కాశ్మీరీ విద్యార్థులు పాక్ గెలుపు తర్వాత సంబరాలు జరుపుకున్నారని.. కొందరు ఆగ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆగ్రా సిటీ ఎస్పీ మాట్లాడుతూ.. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. విచారణ అనంతరం ముగ్గురు కశ్మీరీ విద్యార్థులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా ముగ్గురు విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆగ్రాలోని రాజా బల్వంత్ సింగ్ కళాశాల యాజమాన్యం అంతకుముందు ప్రకటించింది.
Agra: 3 Kashmiri students of RBS College arrested for allegedly celebrating Pakistan’s victory in INDvPAK match.
SP City Agra says, “Incident came to light that after match, anti-national remarks were made. We received complaint & FIR was lodged. They were arrested after probe.” pic.twitter.com/JtQOOcpI8t
— ANI UP (@ANINewsUP) October 28, 2021
సీఎం యోగి సీరియస్.. వార్నింగ్
ఇదిలాఉంటే.. ఈ ఘటన అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విట్ ద్వారా హెచ్చరించారు. పాకిస్తాన్ విజయం అనంతరం ఆ దేశానికి మద్దతు తెలుపుతూ సంబురాలు జరుపుకున్న వారిపై దేశద్రోహం కేసు నమోదు చేస్తామని యూపీ సీఎం యోగి స్పష్టం చేశారు. ఈమేరకు ట్విట్ చేశారు.
Sedition (Law) will be invoked against those celebrating the victory of Pakistan: UP Chief Minister Yogi Adityanath #INDvPAK pic.twitter.com/AuxvcwbEgO
— ANI UP (@ANINewsUP) October 28, 2021
Also Read: