Anantapur Road Accident: వారంతా తిరుమల దైవ దర్శనానికి వెళ్లి వస్తున్నారు.. రాత్రి కావడంతో అందరు నిద్ర మత్తులో జారుకున్నారు. ఈ క్రమంలో.. ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మినీ బస్సు బోల్తా పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఏపీలోని అనంతపురం (Anantapur) జిల్లాలో చోటుచేసుకుంది. నల్లమాడ మండలం పులగంపల్లి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం (Road Accident) జరిగినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఆరుగురికి గాయాలైనట్లు నల్లమాడ పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరంతా తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి తిరిగివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నల్లమాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: