Karnataka: కంచె చేను మేయడమంటే ఇదే.. బ్యాంకుకు కన్నమేసిన క్యాషియర్‌.. స్నేహితులతో కలిసి ఏకంగా..

|

Mar 15, 2022 | 10:05 AM

కంచె చేను మేసినట్లు పనిచేస్తున్న బ్యాంకులోనే చోరీకి పాల్పడ్డాడు ఓ క్యాషియర్‌. ఇద్దరు స్నేహితుల సహాయంతో లాకర్‌లోని నగదును, నగలను చాకచక్యంగా దొంగిలించాడు. విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Karnataka: కంచె చేను మేయడమంటే ఇదే.. బ్యాంకుకు కన్నమేసిన క్యాషియర్‌.. స్నేహితులతో కలిసి ఏకంగా..
Bank Robbery
Follow us on

కంచె చేను మేసినట్లు పనిచేస్తున్న బ్యాంకులోనే చోరీకి పాల్పడ్డాడు ఓ క్యాషియర్‌. ఇద్దరు స్నేహితుల సహాయంతో లాకర్‌లోని నగదును, నగలను చాకచక్యంగా దొంగిలించాడు. విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు బ్యాంకు క్యాషియరే (Bank Cashier) ఈ చోరికి పాల్పడ్డాడని నిగ్గు తేల్చాయి. దీంతో బ్యాంకు మేనేజర్‌తో సహా సిబ్బంది ముక్కుమీద వేలేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. కర్ణాటక (Karnataka) లోని బెళగావి జిల్లా మురగోడ గ్రామంలోని సహకార బ్యాంకు శాఖలో దోపిడీ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4.73 కోట్ల నగదు, రూ.1.63 కోట్ల విలువ చేసే నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బసవరాజ హుణశికట్టి, సంతోష్‌ కంబార, గిరీశ్‌ బెళవలగా గుర్తించారు.

నకిలీ తాళం చెవులతో..

కాగా నిందితుల్లో బసవరాజ హుణశికట్టి బ్యాంకు శాఖలో క్యాషియర్‌గా పనిచేసేవాడని పోలీసులు గుర్తించారు. ఈ భారీ దోపిడీ పథకానికి కర్త, కర్మ, క్రియ ఇతడేనని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. ‘ఓవర్‌నైట్‌లోనే కోటీశ్వురుడు కావాలన్న అత్యాశతో బసవరాజ హుణశికట్టి ఈ బ్యాంకు దోపిడీకి పథకాన్ని రూపొందించారు. ఆరు నెలల క్రితం దోపిడీ పథకాన్ని తన ఇద్దరు స్నేహితులకు వివరించాడు. క్యాషియర్‌ కావడంతో లాకర్‌ నకిలీ తాళం చెవుల్ని తయారు చేయించాడు. వాటిసాయంతో లాకర్‌లోని నగలు, నగదును చోరీ చేశాడు. వాటిని తన చెరకు తోటలో గోతి తీసి పూడ్చిపెట్టాడు. పరిస్థితులన్నీ సద్దుమణిగిన తరువాత పంపకాలు చేసుకోవాలని నిర్ణయించారు’ అని కేసు వివరాలను వెల్లడించారు పోలీసులు. కాగా విచారణలో భాగంగా క్యాషియర్‌ బసవరాజ హుణశికట్టి తడబడుతూ చెప్పిన సమాధానాలు పోలీసుల అనుమానాన్ని నిజం చేశాయి. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపెట్టాడు. అతడి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మిగిలిన ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు పోలీసులు. పొలంలో దాచి పెట్టిన నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.

Also Read:Viral Video: స్నేహితుడి పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్.. బ్యాండ్‏తో ఊరేగింపుగా తీసుకెళ్లి మరి.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Sreemukhi: చిట్టి గౌనులో చిన్నది.. యాంకరమ్మ హాట్ లేటెస్ట్ ఫోటోస్

జనాల వెంటపడిన చిరుత పులి !! చివరికి ఏమైందో తెలుసా ?? వీడియో