AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హర్యానాలో భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

హర్యానాలో భారీగా గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. హిసార్‌ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారం అందడంతో.. రెండు చోట్ల జరిపిన..

హర్యానాలో భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 18, 2020 | 9:36 PM

Share

హర్యానాలో భారీగా గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. హిసార్‌ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారం అందడంతో.. రెండు చోట్ల జరిపిన తనిఖీల్లో రెండు క్వింటాల్ల గంజాయి పట్టుబడిందని తెలిపారు. ఈ ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్ చేశామన్నారు. వీరు ఒడిషా నుంచి అక్రమంగా గంజాయిని తీసుకువచ్చి.. హర్యానా ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. పట్టుబడ్డ వారిలో ఒకరు యూపీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిపారు. జిల్లాలోని జిందాల్ బ్రిడ్జ్‌ ప్రాంతంలో 140 కిలోల గంజాయిని గుర్తించామని.. ఆరు ప్లాస్టిక్ బ్యాగుల్లో వీటిని యూపీకి చెందిన సుభాష్ అనే వ్యక్తి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక మరో సంఘటనలో పంజాబ్‌కు చెందిన మరో వ్యక్తి అగ్రోహ టోల్ ప్లాజా వద్ద చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డాడని.. అతని వద్ద నుంచి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రెండు ఘటనలపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us
చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది
చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి
OTTలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTTలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?
సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?
ఆ చివర భోగాపురం.. ఈ చివర మామునూరు.. ఎక్కడినుంచి ఎక్కడికైనా టేకాఫ్
ఆ చివర భోగాపురం.. ఈ చివర మామునూరు.. ఎక్కడినుంచి ఎక్కడికైనా టేకాఫ్
ఉదయాన్నే ఈ ప్రోటీన్ ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఖాయం..
ఉదయాన్నే ఈ ప్రోటీన్ ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఖాయం..
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య
నీకు ఛాన్స్ ఇస్తే..నాకు ఏమిస్తావు? సంచలన విషయాలు చెప్పిన రోహిణి
నీకు ఛాన్స్ ఇస్తే..నాకు ఏమిస్తావు? సంచలన విషయాలు చెప్పిన రోహిణి
Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా..
Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా..
పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ..
పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ..