Ships Collision: అరెబియా సముద్రంలో ప్రమాదం.. ఢీకొన్న కార్గో షిప్‌లు.. కొనసాగుతున్న రెస్క్యూ

|

Nov 27, 2021 | 2:48 PM

Foreign Cargo Ships Collision: అరెబియా సముద్రంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో ఓఖాకు 10 మైళ్ల దూరంలో రెండు విదేశీ కార్గో షిప్‌లు ఒకదానికొకటి

Ships Collision: అరెబియా సముద్రంలో ప్రమాదం.. ఢీకొన్న కార్గో షిప్‌లు.. కొనసాగుతున్న రెస్క్యూ
Ships Collision
Follow us on

Foreign Cargo Ships Collision: అరెబియా సముద్రంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో ఓఖాకు 10 మైళ్ల దూరంలో రెండు విదేశీ కార్గో షిప్‌లు ఒకదానికొకటి ఢీకొన్నట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రక్షణ శాఖ తెలిపింది. ఆరేబియాలోని గ‌ల్ఫ్ ఆఫ్ క‌చ్‌లో శుక్రవారం రాత్రి ఎంవీఎస్ ఏవియేట‌ర్‌, అట్లాంటిక్ గ్రేస్ ఓడ‌లు ఒక‌దానిని ఒక‌టి ఢీకొన్నాయి. అయితే ఈ ఘటనలో చ‌మురు లీకేజీ చోటుచేసుకున్నట్లు పేర్కొంటున్నారు. సమాచారం తెలియడంతో.. ఇండియ‌న్ కోస్ట్‌గార్డ్ షిప్‌లను మోహరించి ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. దీంతోపాటు పొల్యూష‌న్ కంట్రోల్ నౌక‌ను కూడా అక్కడికి పంపించారు. ఢీకొన్న ఓడల ద్వారా ఏమైనా ర‌సాయనాలు స‌ముద్రంలో క‌లిసి ఉంటే ఈ నౌకతో శుభ్రంచేయనున్నారు.

రక్షణ చర్యల కోసం కోస్ట్ గార్డ్స్ బృందంతో పాటు పెట్రోలింగ్ షిప్, హెలికాప్టర్‌ను కూడా మోహరించినట్లు రక్షణశాఖ తెలిపింది. ప్రస్తుతం ఓడల్లోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

Also Read:

Chanakya Niti: మనిషికి సమతుల్య ప్రవర్తన అవసరం.. మరీ ముఖ్యంగా ఆ మూడు విషయాల్లో.. చాణక్యుడు చెప్పిన అవి ఏమిటో తెలుసుకుందాం..

Neem Trees: వేప ఆపదలో ఉందా?.. ఔషదం మొక్క అంతం కాబోతోందా? ఊహకందని తెగుళ్ల వెనుక అసలు కారణం అదేనా!