Fake Currency: రంగురాళ్ల చోరీ కేసులో ఊహించని ట్విస్ట్.. జ్యోతిష్యుడి ఇంట్లోనే రూ.18 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం..

| Edited By: Ravi Kiran

Jun 24, 2021 | 7:03 AM

Fake Currency Seize: జ్యోతిష్యుడు మురళీకృష్ణ శర్మ ఇంట్లో రంగు రాళ్ల చోరీ కేసు ఊహించని కొత్త మలుపు తిరిగింది. తన ఇంట్లోని రంగురాళ్లు, కొంత నగదు చోరీకి గురయ్యాయంటూ

Fake Currency: రంగురాళ్ల చోరీ కేసులో ఊహించని ట్విస్ట్.. జ్యోతిష్యుడి ఇంట్లోనే రూ.18 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం..
2000 Note
Follow us on

Fake Currency Seize: జ్యోతిష్యుడు మురళీకృష్ణ శర్మ ఇంట్లో రంగు రాళ్ల చోరీ కేసు ఊహించని కొత్త మలుపు తిరిగింది. తన ఇంట్లోని రంగురాళ్లు, కొంత నగదు చోరీకి గురయ్యాయంటూ హైదరాబాద్‌లోని నాగోలుకు చెందిన బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ వారం రోజుల క్రితం ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురు నిందితులు.. విచారణలో పలు కీలక విషయాలను వెల్లడించారు. తాము చోరీ చేసిన నగదును నకిలీ నోట్లుగా గుర్తించి తగలబెట్టేశామని నిందితులు వెల్లడించారు. దీంతో నకిలీ నోట్లు ఎలా వచ్చాయని మురళీ శర్మను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.18 కోట్ల విలువైన నకిలీ నోట్లు, రూ. 6 లక్షల విలువైన నగదు లభ్యమైనట్టు పోలీసులు బుధవారం వెల్లడించారు.

హవాలా మనీ కేసులో మురళీకృష్ణపై గతంలో కేసు నమోదైందని, జైలుకు కూడా వెళ్లి వచ్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. టీవీ చానళ్లలో ప్రకటనల ద్వారా పలువురికి నకిలీ రంగురాళ్లు విక్రయించినట్టు గుర్తించారు. నలుగురు అనుచరుల ద్వారా ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో మురళీశర్మ నకిలీ నోట్లను చలామణి చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని క్రైం పోలీసులు తెలిపారు.

విశాఖపట్టణంలో ఓ కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన ట్రేడింగ్ కంపెనీలో రూ. 90 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు మురళీ కృష్ణ శర్మ మల్కాజిగిరి ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు నుంచి నగదు బదిలీ చేశారు. అయితే ఆ బ్యాంకు అధికారులకు అనుమానం రావడంతో నగదు బదిలీని మధ్యలోనే నిలిపివేశారు. ఈ కేసులో అప్పట్లో మురళీశర్మతోపాటు నలుగురు బ్యాంకు అధికారులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

అనంతరం బెయిలుపై విడుదలైన మురళీ కృష్ణ తర్వాత నాగోలులో ఉంటున్నాడు. మురళీ శర్మ చదివింది పదో తరగతే అయినా.. నకిలీ నోట్లు, రంగురాళ్ల మోసాలకు పాల్పడుతూ రూ. కోట్లు సంపాదించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. ఈ నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు సరఫరా చేశారు.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:

Shocking Visuals: నిర్దాక్షిణ్యంగా పదిహేడేళ్ళ బాలికను రెండంతస్థుల భవనంపై నుంచి నెట్టేసిన దుండగులు.. షాకింగ్ వీడియో!

Nellore twins death: అనుమానాస్పద స్థితిలో 10 నెలల వయసున్న కవలల మృతి.. పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు..!