Tamilnadu: చోరీ చేసిన బంగారాన్ని శ్మశానంలో పాతిపెట్టిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే..

|

Dec 20, 2021 | 9:28 PM

తమిళనాడులోని వెల్లూరుకు చెందినో ఓ వ్యక్తి ఇటీవల ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణంలో చోరీకి వెళ్లాడు. దాదాపు 16 కిలోల బంగారు ఆభరణాలను పట్టుకెళ్లాడు.

Tamilnadu: చోరీ చేసిన బంగారాన్ని శ్మశానంలో పాతిపెట్టిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే..
Follow us on

తమిళనాడులోని వెల్లూరుకు చెందినో ఓ వ్యక్తి ఇటీవల ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణంలో చోరీకి వెళ్లాడు. దాదాపు 16 కిలోల బంగారు ఆభరణాలను పట్టుకెళ్లాడు. పోలీసులతో పాటు ఎవరికీ అనుమానం రాకూడదని ఏకంగా శ్మశానంలో చోరీ చేసిన సొమ్మును దాచిపెట్టాడు. కానీ పోలీసుల ముందు ఆ దొంగ కుప్పిగంతులు ఎక్కువకాలం సాగలేదు. సీసీటీవీ ఫుటేజ్‌ల సహాయంతో దొంగను గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుచేశారు. దీంతో ఆ చోరుడు పోలీసుల చేతికి చిక్కక తప్పలేదు. ఈ నేపథ్యంలో అతడిని తమదైన శైలిలో విచారించి శ్మశానంలో పాతిపెట్టిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అయితే దొంగ వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. ‘ వెల్లూరులోని అనైకట్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈనెల 15న ముసుగు ధరించి ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణంలోకి ప్రవేశించాడు. 16 కిలోల బంగారంతో పాటు మరికొన్ని ఆభరణాలను పట్టుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి సహాయంతోనే నిందితుడిని గుర్తించాం. వేలూరు పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడుకత్తూరు శ్మశానవాటికలో అతను చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాం’ అని వేలూరు పోలీసులు పేర్కొన్నారు.
Also read:

Fake Baba: మహిళా భక్తులే టార్గెట్.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం.. వెలుగులోకి దొంగబాబా రాసలీలలు!

 

Crime News: కనిపించకుండాపోయిన తల్లి, ఇద్దరు పిల్లలు.. వ్యవసాయ బావిలో తేలిన ముగ్గురి మృతదేహాలు!

 

Pakistan Cricket Team: మైనర్‌పై అత్యాచారం.. పాకిస్తాన్‌ స్పిన్నర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు..!