Hooch Tragedy: అలీగఢ్‌లో దారుణం.. కల్లీ మద్యం తాగి 15 మంది మృత్యువాత.. మరికొంత మంది పరిస్థితి..

15 dead after consuming spurious liquor: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ ఆసుపత్రుల్లో

Hooch Tragedy: అలీగఢ్‌లో దారుణం.. కల్లీ మద్యం తాగి 15 మంది మృత్యువాత.. మరికొంత మంది పరిస్థితి..
Hooch Tragedy In Aligarh

Updated on: May 29, 2021 | 9:42 AM

15 dead after consuming spurious liquor: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అలీగఢ్ ప్రాంతంలోని కర్సియాలోని ఓ లైసెన్స్‌డ్‌ దుకాణం నుంచి కొనుగోలు చేసిన మద్యం తాగడం వల్లే వారంతా మరణించినట్లు అధికారులు నిర్దారించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ ఓ ప్రత్యేక కమిటీని నియమించారు. దోషులుగా తేలిన వారిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తామని.. కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ చంద్ర భూషణ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కాగా.. లోథా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు, కర్సియాలో మరో ఆరుగురు మరణించినట్లు సమాచారం అందిందని కలెక్టర్ పేర్కొన్నారు. వీరంతా ఒకే చోట మద్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకూ కల్తీ మద్యం తాగడం వల్ల మరణించిన వారి 15కు చేరిందని అధికారులు వెల్లడించారు.

కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురైన 16 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు లిక్కర్‌ షాపు సీజ్‌ చేసి శాంపిల్స్‌ను తీసుకుని ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే.. ఈ ఘటన అనంతరం ఎక్సైజ్‌ విభాగం అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ, జిల్లా ఎక్సైజ్‌ ఆఫీసర్, ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్, హెడ్‌ కాన్‌స్టేబుల్‌లను వెంటనే విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరిపై శాఖాసంబంధిత విచారణ ప్రారంభమైందని.. కలెక్టర్ చంద్రభూషణ్ వివరించారు. ఇదిలాఉంటే.. మృతుల కుటుంబాలకు యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది.

Also Read:

Marriage Ceremony: పెళ్లి మండపంపై తెగిపడిన విద్యుత్ తీగలు.. నలుగురు మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు..

Tamil Actress Chandini: ఐదేళ్లుగా సహాజీవనం.. అవసరం తీరాక దూరం.. మాజీ మంత్రిపై వర్థనమాన నటి సంచలన ఆరోపణలు..!