Challan Pending: మామూలోడు కాదు.. చలానాల చిట్టా చూసి అవాక్కైన ట్రాఫిక్‌ పోలీసులు..!

117 challans pending to honda activa: చ‌లానాలు కట్టకుండా తిరుగుతున్న వాహ‌నాల‌పై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్

Challan Pending: మామూలోడు కాదు.. చలానాల చిట్టా చూసి అవాక్కైన ట్రాఫిక్‌ పోలీసులు..!
Traffic Police

Updated on: Nov 16, 2021 | 7:20 PM

117 challans pending to honda activa: చ‌లానాలు కట్టకుండా తిరుగుతున్న వాహ‌నాల‌పై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రతీ వాహ‌నాన్ని ఆపి చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాంప‌ల్లిలో ట్రాఫిక్ పోలీసులు.. హోండా యాక్టివా ఏపీ 09 ఏయూ 1727 వాహ‌నాన్ని ఆపి చెక్ చేయ‌గా దిమ్మ తిరిగిపోయే విష‌యం బయటపడింది. హోండా యాక్టివాపై ఏకంగా 117 చ‌లాన్లు పెండింగ్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తం చ‌లాన్ల విలువ 30,000 వేల రూపాయలుగా ఉంది. చ‌లాన్లు కట్టకుండా తిరుగుతున్న హోండా యాక్టివా య‌జ‌మానిని పోలీసులు అదుపులోకి తీసుకుని వాహ‌నాన్ని సీజ్ చేశారు.

మహ్మద్‌ ఫరీద్‌ ఖాన్‌ పేరుతో ఉన్న ఏపీ09 ఏయూ 1727 నెంబర్‌ గల హోండా యాక్టివాపై ఉన్న 117 చలాన్లు చూసి పోలీసులే షాకయ్యారు. ఈ బైక్‌పై 2015 నుంచి చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. చలానా విధించిన ఏ ఒక్క ఫోటోలోనూ హెల్మెట్‌ లేదని.. కరోనా పీక్స్‌ టైమ్‌లో కూడా మాస్క్‌ లేకుండానే తిరిగినట్లు పోలీసులు గుర్తించారు.

మరోవైపు వాహ‌న‌దారులు త‌ప్పనిస‌రిగా రూల్స్ పాటించాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. వాహనాల‌పై చ‌లాన్లు ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాల‌ని కోరుతున్నారు. చ‌లాన్లు కట్టకుంటే మోటార్ యాక్ట్ కింద కేసులు న‌మోదు చేసే అవ‌కాశం ఉంటుంద‌ని హెచ్చరిస్తున్నారు.

Also Read:

Video Viral: పెళ్లిలో సీన్ రివర్స్.. తళుక్కుమందమనుకున్నారు.. బొక్కబోర్లా పడ్డారు.. వీడియో వైరల్..

CM KCR: రైతు దీక్షకు సీఎం కేసీఆర్‌..? కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన గులాబీ దళం..