Black Fungus: దేశంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా మరణాలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఇక కరోనా నుంచి కోలుకున్న వారిలో కనిపిస్తోన్న బ్లాక్ ఫంగస్ అనే కొత్త వ్యాధి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 9000కి పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వ్యాధి కారణంగా మొత్తం 212 మంది ప్రాణాలు సైతం కోల్పోయారు.
ఇదిలా ఉంటే అసలు ఫంగస్ ఎందుకు వస్తుందన్న దానిపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారిలో, ఎక్కువ డోస్‌లో స్టెరాయిడ్స్ తీసుకున్న వారిలో బ్లాక్‌ఫంగస్ సోకుతున్నట్లు ఇప్పటి వరకు బయట పడ్డ ఆధారాల ద్వారా ఓ అంచనాకు వచ్చారు. ఇక యువతలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతుండడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. కోవిడ్ చికిత్సలో భాగంగా ఉపయోగించే జింక్ కూడా బ్లాక్ ఫంగస్ వృద్ధికి కారణమని చెబుతున్నారు. కోవిడ్ పేషెంట్స్‌కు చికిత్సలో ఉపయోగించే జింక్ వినియోగాన్ని వెంటనే తగ్గించాలని సూచిస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎమ్ఏ) మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ జయదేవన్ ఈ విషయమై మాట్లాడుతూ.. జింక్, ఐరన్ వంటి మెటల్స్ ఫంగస్ వృద్ధికి సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read: కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా ఓరుగల్లు వాస్తవ్యుడు.. ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ నియామకం