Telangana Lockdown: స‌రైన‌ కారణం లేకుండా బ‌య‌ట‌ కనిపిస్తే ఐసోలేషన్‌కే.. అతి చేస్తే తాట తీస్తున్న పోలీసులు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లా కావడంతో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో

Telangana Lockdown: స‌రైన‌ కారణం లేకుండా బ‌య‌ట‌ కనిపిస్తే ఐసోలేషన్‌కే.. అతి చేస్తే తాట తీస్తున్న పోలీసులు
Lockdown violators

Updated on: Jun 06, 2021 | 5:52 PM

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లా కావడంతో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా అనవసరంగా బయట తిరిగే యువకులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్‌ చేస్తున్నారు. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బయట తిరుగుతున్న 14 మంది ఆకతాయిలకు కరోనా రాపిడ్ టెస్టులు నిర్వహించి, ఐసోలేషన్‌కు తరలించారు. జైపూర్, పెగడపల్లి, గంగిపల్లి, ఎలకంటీ, షేట్ పల్లి, గ్రామాలలో పెట్రోలింగ్ చేస్తుండగా యువకులు బలాదూర్‌గా తిరగుతూ పోలీసులకు చిక్కారు. కరోనాతో తమకు సంబంధం లేదన్నట్టు బాధ్యతా రాహిత్యంతో నిబంధనలు గాలికి వదిలి బయట తిరుగుతున్నారు. దీంతో 14 మందిని పట్టుకొని వారికి రాపిడ్ టెస్ట్ లు నిర్వహించారు. వారందరికీ నెగిటివ్ వచ్చినా.. నిబంధనలు ఉల్లంఘించినందుకు బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు.

జైపూర్ మండలంలోని ప్రతి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. అనవసరంగా బయట తిరిగే వ్యక్తులకు రాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని లేదంటే ఐసోలేషన్‌కు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు.

Also Read:  టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై మరో కేసు, ఇవి వివ‌రాలు

వజ్రాలు చోరీ చేసి..ఈ కేటుగాళ్లు ఎక్క‌డ దాచారో తెలుసా.. ప‌క్కా ప్లాన్