ఎమ్మెల్యే కోసం మృత్యుంజయ హోమం
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కరోనా బారినపడ్డారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే..
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కరోనా బారినపడ్డారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే దొరబాబుకు మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆయనను బెంగళూరు తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలంటూ పలువురు నేతలు ఆకాంక్షించారు. వైసీసీ పార్టీ చెందిన పలువరు నేతలు, కార్యకర్తలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. తాడిపర్తి అపర్ణా సమేత నాగేశ్వరస్వామి వారి దేవస్థానంలో మృత్యుంజయ హోం నిర్వహించారు. నాగేశ్వరస్వామి వారికి మృత్యుంజయ రుద్రాభిషేకం, అపర్ణాదేవి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు. కరోనా రోగనివారణ స్థానిక ఎమ్మెల్యే దొరబాబుతో పాటు నియోజకవర్గంలో ఉన్న వారంతా ఆయురారోగ్యాలతో ఉండేందుకు ఈ హోమం నిర్వహించినట్లుగా ఆలయ పండితులు తెలిపారు.