సీఎం సహాయ నిధికి.. విరాళంగా ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు

| Edited By: Pardhasaradhi Peri

Mar 25, 2020 | 7:24 PM

'కరోనా కట్టడికి జగన్ చేస్తోన్న కృషిపై ప్రశంసలు కురిపించారు. అలాగే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ వైరస్ కట్టడికి చేస్తోన్న కృషి.. అభినందనీయమన్నారు. కరోనాను కట్టడి చేయడంలో.. వాలంటీర్ వ్యవస్థ..

సీఎం సహాయ నిధికి.. విరాళంగా ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు
Follow us on

కరోనా వైరస్ ఏపీలోనూ నెమ్మదిగా విజృంభిస్తూండటంతో.. నివారణకు జగన్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇప్పటికే ప్రజలను బయటకు రానీయకుండా సీఎం జగన్ ప్రత్యేక అధికారాలు జారీ చేశారు. అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఎంపీ నిధుల నుంచి సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ.4 కోట్లను కేటాయిస్తున్నట్లు మచిలీపటప్నం ఎంపీ బాలశౌరి ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓ లేఖ రాశారు.

‘కరోనా కట్టడికి జగన్ చేస్తోన్న కృషిపై ప్రశంసలు కురిపించారు. అలాగే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ వైరస్ కట్టడికి చేస్తోన్న కృషి.. అభినందనీయమన్నారు. కరోనాను కట్టడి చేయడంలో.. వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తోందని ప్రశంసించారు. సహచర ఎంపీలు కూడా తమ ఎంపీలాడ్స్ నిధుల నుంచి కొంత మొత్తాన్ని కరోనా నియంత్రణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తే రాష్ట్ర ఖజానాపై కొంత భారం తగ్గుతుందని’.. లేఖలో అభిప్రాయం వ్యక్తం చేశారు బాలశౌరి. కాగా మంగళవారం టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వ్యక్తిగతంగా తన కుటుంబ తరుపున 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా నెల రోజుల జీతం విరాళంగా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి: 

ఎక్కడైనా రేట్లు పెంచారా.. ఈ నెంబర్‌కి ఒక్క కాల్ చేస్తే.. తిక్క కుదురుస్తారు

కరోనా నివారణకు.. తెలంగాణలో స్టెరిలైజేషన్..

బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. బట్టలు ఉతుకుతున్న క్రికెటర్

లాక్‌డౌన్ టైంలో బరువు పెరగకుండా ఇలా కేర్ తీసుకోండి..

వాట్సాప్ బంద్ కావడంలేదు.. ఆ ఫేక్ వార్తలను నమ్మకండి..

కరోనా అలెర్ట్: కొత్తవారు ఇంటికొస్తే వెయ్యి జరిమానా

సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు ప్రకటించిన చంద్రబాబు

పోలీస్ ఆఫీసర్‌పై కరోనా కేసు నమోదు.. తన కొడుకుకి కరోనా ఉందని చెప్పనందుకు..

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!