WUHAN LABORATORY CORONA VIRUS BIRTH-PLACE: గత ఏడాదిన్నరగా ప్రపంచాన్ని స్థంభింపచేసిన కరోనా వైరస్ జన్మస్థలం చైనా (CHINA)లోని వూహన్ ల్యాబేనంటూ అగ్రరాజ్యం అమెరికా (AMERICA) కీలక ఆధారాలను సేకరించింది. ఈ కీలక ఆధారాలను కరోనా వైరస్ ఆవిర్భావంపై దర్యాప్తు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WORLD HEALTH ORGANISATION)కు అమెరికా అందజేసింది. తామిచ్చిన సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తే చైనా జీవాయుధ (BIO WEAPON) కుట్రలు ప్రపంచానికి తెలుస్తాయని అమెరికా వాదిస్తోంది. మరోవైపు కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందన్న ఆరోపణలపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సమయంలో చైనా చుట్టూ గట్టి ఉచ్చు బిగించాలని చూస్తున్న అమెరికా తమ దర్యాప్తు సంస్థ ఎఫ్.బీ.ఐ. (FBI) ద్వారా కీలక ఆధారాలను సేకరించింది. సార్స్-సీవోవీ-2 వైరస్ కారకం వూహన్ ల్యాబ్‌లోనే పుట్టిందనే అనుమానాల్ని బలపరిచేలా కీలక ఆధారాన్ని డబ్ల్యూహెచ్‌వో (WHO) ప్యానెల్ ముందుంచింది.
ప్రపంచాన్ని కరోనా ముంచెత్తక ముందు.. 2019 నవంబర్‌లో వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (WUHAN INSTITUTE OF VIROLOGY)లో పనిచేసే ముగ్గురు పరిశోధకులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో వాళ్లను హాస్పిటల్లో చేర్పించారు. అయితే వాళ్లు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నవిషయాన్ని చాలా గోప్యంగా ఉంచింది ల్యాబ్ మేనేజ్‌మెంటు. ఆ హాస్పిటల్ బయట గట్టి కాపలా ఏర్పాటు చేసింది. అమెరికన్ నిఘా వర్గాలు (AMERICAN INTELLEGENCE) ఈ వివరాలతో సమగ్రంగా ఒక రిపోర్ట్ తయారు చేశాయి. తాజాగా డబ్ల్యూహెచ్‌వో డెషిషన్ మేకింగ్ బాడీ మీటింగ్‌లో ఈ రిపోర్ట్ చర్చకొచ్చింది. దీంతో కరోనా ఆవిర్భావం గురించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ రిపోర్ట్‌ను పరిశీలించాలని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్ నిర్ణయించింది. ఈ విషయాల్ని ప్రముఖ అమెరికన్ పత్రిక వాషింగ్టన్ డీసీ (WASHINGTON DC) ప్రచురించింది.
కాగా.. వూహన్ ల్యాబ్ సిబ్బంది ముగ్గురు కరోనా లక్షణాలతో సీజనల్ జబ్బులతో హాస్పిటలైజ్ అయ్యారని అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది. అయితే వాళ్లు హాస్పిటల్లో చేరిన సమయం, వారికిచ్చిన చికిత్సను గోప్యంగా ఉంచడం, కొన్నాళ్లకే కరోనా విజృంభించడం.. ఈ అంశాలు కరోనా వైరస్ వూహన్ ల్యాబరేటరీ సృష్టే అనే వాదనను బలపరుస్తున్నాయని తెలిపింది. చైనా మాత్రం అమెరికా ఆరోపణలను మొదటి నుంచి ఖండిస్తోంది. అమెరికా ఓవరాక్షన్ చేస్తోందని, ఈ ఆరోపణలు దర్యాప్తును పక్కదారి పట్టించేలా ఉన్నాయని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కరోనా తమ భూభాగంలో పుట్టలేదని, మేరీల్యాండ్ (MARYLAND)లో ఫోర్ట్ డెట్రిక్ మిలిటరీ బేస్ మీదే తమకు అనుమానాలు ఉన్నాయని చైనా ఇదివరకే డబ్ల్యూహెచ్‌వోకి ఒక రిపోర్ట్ అందజేసింది. అయితే వూహన్ ల్యాబ్ రీసెర్చర్ల ట్రీట్‌మెంట్ గురించి ట్రంప్ (DONALD TRUMP) హయాంలోనే రిపోర్ట్ తయారైనప్పటికీ.. బైడెన్ (JOE BIDEN) కార్యాలయం మాత్రం ఈ ఇష్యూపై స్పందించట్లేదు.
2019 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నెల మధ్య కాలంలో వూహన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు సీజనల్ జబ్బులు (SEASONAL DISEASES) పడడం సర్వసాధారణమని డచ్ వైరాలజిస్ట్ (DUTCH VIROLOGIST) మరియోన్ చెబుతోంది. ఆ ముగ్గురు కరోనా లక్షణాలతోనే చేరారా? అనేది అనుమానం మాత్రమే అని ఆమె ఆంటోంది. ఇక 2019 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య 76 వేల మంది సీజనల్ జబ్బుల బారినపడ్డారు. వాళ్లలో యాంటీ బాడీస్ (ANTI-BODIES) కోసం 92 మందిని మాత్రమే చైనా పరీక్షించింది. ఈ విషయం డబ్ల్యూహెచ్‌వో దృష్టికి రావడంతో వాళ్ల రిపోర్ట్‌లు కోరింది. అయితే గోప్యతను సాకుగా చూపెడుతూ చైనా అందుకు నిరాకరించింది. ఇక వూహన్ ల్యాబ్ బ్లడ్ బ్యాంక్ రిపోర్ట్‌లను సైతం ఇచ్చేందుకు చైనా మొదట అంగీకరించకపోగా.. డబ్ల్యూహెచ్‌వో ఒత్తిడితో దిగొచ్చింది. కానీ, ఇప్పటిదాకా ఎలాంటి రిపోర్టులు సమర్పించలేదు. ఇస్తామంటూనే రిపోర్టులను ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇవ్వకపోవడం.. ప్రతీ అంశాన్ని చైనా రహస్యంగా వుంచుతుండడంతో కరోనా వైరస్ వూహన్ ల్యాబ్ సృష్టే అన్న వాదనకు బలం చేకూరుస్తున్నాయి.
2019 సెప్టెంబర్, అక్టోబర్ నెలలోనే చైనాలో కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ 2020 జనవరి దాకా చైనా కరోనాకు సంబంధించిన అంశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి తీసుకురాకపోవడం కూడా మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది. 2020 జనవరిలో ప్రపంచ దేశాలకు కరోనా విస్తరించడం మొదలైంది. మన దేశంలో జనవరి 31న తొలి కరోనా కేసు నమోదైంది. అప్పటికి దేశంలో కరోనాను గుర్తించే మెకానిజం కూడా సరిగ్గా లేదు. దేశంలో ఎక్కడ కరోనా శాంపిల్ సేకరించినా.. పుణెలోను వైరాలజీ ల్యాబుకు పంపాల్సి వచ్చింది. అలా కరోనాపై అధ్యయనం ప్రారంభమయ్యే నాటికే దేశంలో కరోనా కేసులు పెరిగిపోయాయి. ఇదే పరిస్థితి అమెరికాకు వచ్చింది. అయితే.. తొలి వేవ్‌లో అగ్రరాజ్యం అమెరికా కరోనా మరణాలతో కుదేలైపోయింది. దాదాపు ఆరు లక్షల మంది కరోనాకు బలయ్యారు. మనదేశం తొలి వేవ్‌ను సమర్థవంతంగానే ఎదుర్కొన్నా.. మ్యూటెంట్ అయిన కరోనా వేరియంట్ బీ.1.617 వెరైటీ వైరస్ దేశంలోకి ఎంటర్ కావడంతో కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) దారుణంగా దెబ్బ కొట్టింది. ఇంతటి పెను విషాదానికి కారణమైన చైనా చుట్టు ఇపుడు ఉచ్చు బిగుస్తుండడం కొంతలో కొంత ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోంది.
ALSO READ: బ్లాక్ ఫంగస్‌కు కారణం స్టెరాయిడ్స్, డయాబెటీస్ కాదట.. ఇంకేదో వుందంటున్న ఇండోర్ ప్రొఫెసర్
ALSO READ: ఎవర్ గివెన్ షిప్ వ్యవహారంలో కొత్త మలుపు.. తప్పంతా సూయిజ్ అథారిటీదేనంటూ ఎదురు దాడి