కరోనా వైరస్.. ఆ సర్టిఫికేట్ల విషయంలో డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్..!

కరోనా విషయంలో మరోసారి అన్ని దేశాలను హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో ). ఒకసారి కరోనా నుంచి కోలుకున్న వారికి రెండోసారి ఈ వ్యాధి సోకదని కచ్చితంగా చెప్పలేమని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

కరోనా వైరస్.. ఆ సర్టిఫికేట్ల విషయంలో డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్..!

కరోనా విషయంలో మరోసారి అన్ని దేశాలను హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో ). ఒకసారి కరోనా నుంచి కోలుకున్న వారికి రెండోసారి ఈ వ్యాధి సోకదని కచ్చితంగా చెప్పలేమని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కరోనా కేసులు తక్కుతోన్న క్రమంలో కొన్ని దేశాలు లాక్‌డౌన్‌ సడలింపులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న వారిని ఇమ్యూనిటీ పాస్‌పోర్టులు(రిస్క్‌ ఫ్రీ సర్టిఫికేట్లు) ఇవ్వాలనే యోచనలో ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి శరీరంలో కరోనా నిరోధక యాంటీబాడీలు ఉన్న వారికి ఇవి ఇవ్వాలని అనుకుంటున్నాయి. ఈ సర్టిఫికేట్లు పొందిన వారు ఆయా దేశంలో స్వేచ్ఛగా జీవించొచ్చు.

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా సోకదు అనేందుకు శాస్త్రీయమైన ఆధారేలీవీ లేవని స్పష్టం చేసింది. సర్టిఫికేట్లున్న వారు భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు పక్కనపెట్టడం వలన వారికి తెలీకుండానే వైరస్ వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదముందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది.

Read This Story Also: కరోనా వైరస్: ఆ దేశంలో ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితులు..!