కరోనా వైరస్: ఆ దేశంలో ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితులు..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. 210 దేశాలు ఈ మహమ్మారితో పోరాటం చేస్తున్నాయి. కాగా లాటిన్ అమెరికాలోని అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌ పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది

కరోనా వైరస్: ఆ దేశంలో ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితులు..!
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 6:51 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. 210 దేశాలు ఈ మహమ్మారితో పోరాటం చేస్తున్నాయి. కాగా లాటిన్ అమెరికాలోని అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌ పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. రియోడిజెనీరో నగరంతో పాటు మరో నాలుగు ప్రధాన నగరాల్లో ఇప్పటికే అన్ని ఆసుపత్రులు కరోనా బాధితులతో నిండిపోయాయి. దీంతో కొత్త కేసులు చేర్చుకోలేమని ఇప్పటికే ఆ దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రిలు చేతులెత్తేశాయి. మరోవైపు శవాగారాలు, శ్మశానవాటికలు నిండిపోతున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బ్రెజిల్లో అధికారికగా నమోదైన కరోనా కేసుల సంఖ్య కంటే మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు.

కాగా ఓ వైపు కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుంటే.. మరోవైపు ఆ దేశాధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వైరస్‌ను ఎదుర్కోవడానికి సామాజిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, అధిక ప్రమాదం ఉన్న వారిని మాత్రమే ఐసోలేట్ చేయాలని ఆయన సూచిస్తున్నారు. ఇక మానాస్ నగరంలో.. సామూహిక ఖననాలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం బ్రెజిల్‌లో 59,196 కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,045 మంది మరణించగా.. 29,160 మంది కోలుకున్నారు.

Read This Story Also:  ఏపీలో క‌రోనాపై ఇది శుభ‌వార్తే..ఒక్క‌రోజే ఆ జిల్లానుంచి 24 మంది డిశ్చార్జ్