Covid-19 Vaccination Center in AP: కరోనా భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్.. మీ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా.. వివరాలు తెలుసా?

| Edited By: Ram Naramaneni

Mar 03, 2021 | 10:15 AM

Private Hospitals Covid-19 Vaccine Centres: ఈ భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఆయుష్మాన్ భారత్ (PMJAY) కింద సుమారు 10,000 ప్రైవేట్ ఆసుపత్రులు, సీజీహెచ్ఎస్ (CGHS), ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కింద గుర్తించిన 687 ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాక్సిన్

Covid-19 Vaccination Center in AP:  కరోనా భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్.. మీ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా.. వివరాలు తెలుసా?
COVID-19 Vaccine India
Follow us on

Private Hospitals Covid-19 Vaccine Centres: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది.  మార్చి 1 నుంచి పెద్దఎత్తున డ్రైవ్ ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. మార్చి 1 నుంచి 60ఏళ్లు పైబడిన వారికి, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45ఏళ్ల పైవారికి వ్యాక్సిన్ అందింస్తుంది. ప్రైవేటు మార్కెట్‌లో కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచింది. దీని ధర రూ.250 గా పేర్కొంటూ సర్క్యూలర్‌ను విడుదల చేసింది. అయితే వ్యాక్సిన్ పర్మిషన్ మాత్రం కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రమే ఇస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్రం.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వివరాలను గత శనివారం ప్రకటించింది.

జనవరి 16 నుంచి దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటకు ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి టీకాను ఇస్తున్నారు. అయితే.. దాదాపు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికావడంతో రేపటినుంచి మరో విడత భారీ డ్రైవ్‌ను కేంద్రం చేపట్టనుంది. దీనిలో భాగంగా ప్రైవేటు సహకారం కూడా తీసుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రైవేటు ఆసుపత్రులు నియమనిబంధనలను కచ్చితంగా పాటించాలని.. నేషనల్ కో-విన్ యాప్ ద్వారా టీకా కోసం నమోదు చేసుకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం ఉచితంగానే కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

ఈ భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఆయుష్మాన్ భారత్ (PMJAY) కింద సుమారు 10,000 ప్రైవేట్ ఆసుపత్రులు, సీజీహెచ్ఎస్ (CGHS), ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కింద గుర్తించిన 687 ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాక్సిన్ టీకాలను ఇవ్వనున్నారు. ఈ ఆసుపత్రులను కోవిడ్-19 ఇమ్యూనిజైషన్ సెంటర్లుగా వ్యవహరించనున్నారు. ఈ ఆసుపత్రుల్లో కోవిడ్ టీకా ఒక డోసుకు రూ.250 ఛార్జ్ వసూలు చేయాలని.. పరిమితిని దాటకూడదని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ మేరకు తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న ప్రైవేటు ఆసుప్రతుల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రుల వివరాలను ఈ కింది లింక్ ద్వారా తెలుసుకోండి..

https://www.mohfw.gov.in/pdf/PMJAYPRIVATEHOSPITALSCONSOLIDATED.xlsx

Also Read:

Corona Vaccination:: 45 ఏళ్ళు పైబడిన, వివిధ వ్యాధిగ్రస్తులకు కరోనా వైరస్ వ్యాక్సినేషన్, ఏ ఏ వ్యాధులంటే ?

Shanmukh Jaswanth Deepthi Sunaina: దీప్తి, షణ్ముఖ్‌ జశ్వంత్ మధ్య రిలేషన్ ఏంటి..? ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందా..?