ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అప్‌డేట్.. పెద్ద సర్‌ప్రైజ్ మీకోసం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి ఓ ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రం గురించి అప్‌డేట్ ఇవ్వాలంటూ ఫ్యాన్స్‌ నుంచి సందేశాలు వెల్లువెత్తడంతో..

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అప్‌డేట్.. పెద్ద సర్‌ప్రైజ్ మీకోసం

Edited By:

Updated on: Aug 31, 2020 | 2:56 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి ఓ ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రం గురించి అప్‌డేట్ ఇవ్వాలంటూ ఫ్యాన్స్‌ నుంచి సందేశాలు వెల్లువెత్తడంతో.. చిత్రా నిర్మాతల్లో ఒకరైన నాగ వంశీ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

”ఎన్టీఆర్ కొత్త సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్‌ నుంచి ఇప్పటికే చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. షూటింగ్ మొదలు పెట్టిన వెంటనే అందుకు సంబంధించి వివరాలు వెల్లడిస్తాం. టైటిల్‌ను ప్రకటించడం కూడా మాకు కాస్త సెంటిమెంట్. అందుకే చెప్పలేకపోతున్నాం. కాబట్టి మాపై నమ్మకం ఉంచంది. మీకు పెద్ద సర్‌‌ప్రైజ్‌ని మీకోసం తీసుకురాబోతున్నాం అంటూ నాగ వంశీ ట్వీట్ చేశారు”.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’‌లో నటిస్తున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది. పరిస్థితులు అనుకూలించిన వెంటనే షూటింగ్ మొదలు పెడతారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రం ప్రారంభం కాబోతుంది.

Also Read:

అమ్మాయిల వివాహ వయసు పెంచే ఆలోచనలో కేంద్రం

కోవిడ్‌తో టాలీవుడ్ నిర్మాత మృతి

బ్రేకింగ్: ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లీక్, వ్యక్తి మృతి

షాకింగ్ న్యూస్: కళ్ళద్దాలపై 9 రోజుల పాటు కరోనా?

వికలాంగుడిగా కనిపించనున్న యంగ్ హీరో?