WHO: డెల్టా వేరియంట్‌‌ను ఓమిక్రాన్ దాటేస్తుంది.. కీలక ప్రకటన చేసిన డబ్ల్యూహెచ్ఓ..

|

Jan 12, 2022 | 11:17 PM

రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స ఉందని హెచ్చరించింది. ఓమిక్రాన్ త్వరగా డెల్టా వేరియంట్‌ను దాటేస్తుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా..

WHO: డెల్టా వేరియంట్‌‌ను ఓమిక్రాన్ దాటేస్తుంది.. కీలక ప్రకటన చేసిన డబ్ల్యూహెచ్ఓ..
New Covid 19 Variant Ihu Di
Follow us on

WHO: దేశం వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 4,868 ఓమిక్రాన్ కేసు ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధిక కేసులు (1,281) నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో రాజస్థాన్ (645) ఉంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో రోజుకు 1 కోటి కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓమిక్రాన్ కేసులతోపాటు కోవిడ్ సంఖ్యలలో కూడా బాగా పెరుగుదల కనిపించింది. బుధవారం నాడు 17 శాతం పెరిగి 1.9 లక్షలకు పైగా తాజా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 9,55,319కి పెరిగాయి. ఇది గత  211 రోజులలో ఈ సంఖ్యే అత్యధికం.

ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స ఉందని హెచ్చరించింది. ఓమిక్రాన్ త్వరగా డెల్టా వేరియంట్‌ను దాటేస్తుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కాకుండా భారతదేశంలో కూడా పెరుగుతోంది. WHO విడుదల చేసిన COVID-19 వీక్లీ ఎపిడెమియోలాజికల్ అప్‌డేట్ ప్రకారం… జనవరి 3-9 వారంలో ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్లకు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని.. అంతకుముందు వారంతో పోలిస్తే 55 శాతం పెరిగిందని వెల్లడించింది. సుమారు 9.5 మిలియన్ కేసులు నమోదైనట్లుగా తాజా  నివేదికలో వెల్లడించింది. WHO తాజా అప్ డేట్ ప్రకారం ఓమిక్రాన్  వేరియంట్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది ఇతర వేరియంట్‌ల కంటే వేగంగా విస్తరిస్తోందని తెలిపింది.

ఇవి కూడా చదవండి: Viral Video: కర్మ ఫలాం ఎలా ఉంటుందో తెలుసా.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..

Viral Video: పక్షులు అత్యవసర మీటింగ్‌లో ఉన్నాయి.. ఏ అంశంపై డిస్కషన్ చేస్తున్నాయో చెప్పుకోండి చూద్దాం..