కరోనాతో జాగ్రత్త…! వెంకీ హెచ్చరిక

మంచి మనుషుల్లా బయటికి రావాలంటూ గత నెలలో ట్వీట్ చేసిన విక్టరీ వెంకటేష్… ఇప్పుడు మరో పోస్ట్ పెట్టారు. లాక్‌డౌన్‌ మాత్రమే ముగుస్తోందని… కరోనా మహమ్మారి అలానే ఉందని అన్నారు. లాక్‌డౌన్ ముగిసిందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ముప్పు తప్పదని హెచ్చరించారు. గత 70 రోజులుగా అనేక చర్యలు తీసుకుని ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మా సంరక్షణ కోసం 24 గంటల పాటు సేవలు అందించిన వైద్య, పారిశుద్ధ్య, పోలీసులకు కృతజ్ఞలు తెలిపితే సరిపోదన్నారు. […]

కరోనాతో జాగ్రత్త...! వెంకీ హెచ్చరిక

మంచి మనుషుల్లా బయటికి రావాలంటూ గత నెలలో ట్వీట్ చేసిన విక్టరీ వెంకటేష్… ఇప్పుడు మరో పోస్ట్ పెట్టారు. లాక్‌డౌన్‌ మాత్రమే ముగుస్తోందని… కరోనా మహమ్మారి అలానే ఉందని అన్నారు. లాక్‌డౌన్ ముగిసిందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ముప్పు తప్పదని హెచ్చరించారు. గత 70 రోజులుగా అనేక చర్యలు తీసుకుని ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మా సంరక్షణ కోసం 24 గంటల పాటు సేవలు అందించిన వైద్య, పారిశుద్ధ్య, పోలీసులకు కృతజ్ఞలు తెలిపితే సరిపోదన్నారు. ఇప్పుడిప్పుడే మెల్లగా గేట్లు తెరుచుకుంటున్నాయి… ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇదే అని గుర్తు చేశారు. లాక్‌డౌన్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలను పాటించామో.. ఇకపై కూడా పాటించాలని సూచించారు.

‘ఎఫ్‌ 2’, ‘వెంకీ మామ’ సినిమాలతో అద్భుత విజయాలను అందుకున్న వెంకీ ఇప్పుడు ‘నారప్ప’ చిత్రంతో ముందుకురానున్నారు. తమిళ హిట్‌ ‘అసురన్‌’కు తెలుగు రీమేక్‌ ‘నారప్ప’. ఇటీవల ఫస్ట్‌లుక్ విడుదలైంది.ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.