5

గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు.. షాకింగ్ నిజాలు.!

యావత్ ప్రపంచాన్ని హడాలెత్తిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి.. గబ్బిలాల ద్వారా సోకిందని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత అది నిజం కాదని నిర్ధారణ అయింది. కానీ కొంతమంది గబ్బిలాలపై విస్తృతమైన పరిశోధనలు చేశారట. అందులో పలు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ‘సోషల్ డిస్టెన్సింగ్‌’ ఇప్పుడు అందరి నోటా ఇదే మాట. కరోనాను కట్టడి చేయాలంటే ఇది మనకున్న ఆయుధం అని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా చెబుతున్నాయి. అయితే ఈ భౌతిక […]

గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు.. షాకింగ్ నిజాలు.!
Follow us

|

Updated on: May 02, 2020 | 2:39 PM

యావత్ ప్రపంచాన్ని హడాలెత్తిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి.. గబ్బిలాల ద్వారా సోకిందని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత అది నిజం కాదని నిర్ధారణ అయింది. కానీ కొంతమంది గబ్బిలాలపై విస్తృతమైన పరిశోధనలు చేశారట. అందులో పలు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ‘సోషల్ డిస్టెన్సింగ్‌’ ఇప్పుడు అందరి నోటా ఇదే మాట. కరోనాను కట్టడి చేయాలంటే ఇది మనకున్న ఆయుధం అని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా చెబుతున్నాయి. అయితే ఈ భౌతిక దూరాన్ని మనం ఇప్పుడు పాటిస్తున్నామని.. కానీ జంతువులు ఎప్పటి నుంచో పాటిస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ముఖ్యంగా గబ్బిలాలు అనారోగ్యానికి గురైనప్పుడు వాటికీ అవే సామాజిక దూరాన్ని పాటిస్తాయట.

వాంపైర్ జాతికి చెందిన గబ్బిలాలు ఇన్ఫెక్షన్‌తో కూడిన జబ్బులు వచ్చినప్పుడు ఒకరికి ఒకరు భౌతిక దూరాన్ని పాటిస్తాయని.. జబ్బు పడిన వాటికి ఆహారాన్ని అందిస్తాయని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనంలో తేలింది. అయితే ఈ గబ్బిలాలు అన్ని జబ్బులకు ఇలా ఉండవని తెలుస్తోంది. కేవలం వైట్‌నోస్‌ సిండ్రోమ్ ఫంగల్ డిసీజ్ సోకినప్పుడే ఇలా భౌతిక దూరాన్ని పాటిస్తాయని అధ్యయనంలో పేర్కొన్నారు. కాగా, గబ్బిలాలతో పాటుగా చీమలు, కోతులు కూడా ఎన్నో ఏళ్ల నుంచి భౌతిక దూరాన్ని పాటిస్తున్నట్లు ఆ అధ్యయనంలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

Read More:

కొంపముంచిన వన్ బై టూ ఛాయ్… గుంటూరులో ఏకంగా 100 మందికి..

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.!

లాక్‌డౌన్‌ 3.0.. జోన్లు వారీగా నిబంధనలు ఇవే..

మందుబాబులకు గుడ్ న్యూస్.. లాక్ డౌన్ తర్వాత తెరుచుకోనున్న మద్యం షాపులు!