కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడు.. కానీ రూ.8 కోట్ల బిల్లు చూసి షాక్‌..

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ లేదనే విషయం తెలిసిందే. అయినా కూడా వివిధ పద్దతుల్లో డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. అలాగే ఇప్పటికే చాలా మంది కోలుకున్నారు. తాజాగా ఓ 70 ఏళ్ల వ్యక్తి కూడా కరోనా నుంచి బయటపడ్డాడు. అయితే అతనికి చికిత్స చేసినందుకుగానూ హాస్పిటల్ వర్గాలు రూ.8 కోట్ల బిల్లు...

కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడు.. కానీ రూ.8 కోట్ల బిల్లు చూసి షాక్‌..

Edited By:

Updated on: Jun 14, 2020 | 5:18 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ లేదనే విషయం తెలిసిందే. అయినా కూడా వివిధ పద్దతుల్లో డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. అలాగే ఇప్పటికే చాలా మంది కోలుకున్నారు. తాజాగా ఓ 70 ఏళ్ల వ్యక్తి కూడా కరోనా నుంచి బయటపడ్డాడు. అయితే అతనికి చికిత్స చేసినందుకుగానూ హాస్పిటల్ వర్గాలు రూ.8 కోట్ల బిల్లు వేశారు. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు.

ఈ ఘటన అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగింది. ‘ది సీటెల్ టైమ్స్’ వెల్లడించిన ప్రకారం.. 70 ఏళ్ల మైఖేల్ అనే వ్యక్తి మార్చి 4వ తేదీన ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో చేరగా.. అతనికి కరోనా వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్థారించారు. దీంతో అతనికి దాదాపు 62 రోజుల పాటు డాక్టర్లు వైద్యం అందించారు. మొత్తానికి మైఖేల్ కరోనా నుంచి కోలుకున్నాడు.

ఇక డిశ్చార్జ్ సమయంలో అతనికి హాస్పిటల్ యాజమాన్యం 181 పేజీల బిల్లును ఇచ్చింది. 42 రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స చేసినందుకు రోజుకు 9,736 డాలర్ల చొప్పున, 29 రోజులు వెంటిలేటర్‌పై ఉంచినందుకు 82 వేల డాలర్ల బిల్లు వేశారు. ఆ మొత్తం 1,122,501.04 డాలర్లు చొప్పున ఇండియా కరెన్సీలో దాదాపు రూ.8 కోట్లు అయింది. అయితే అమెరికాలో వృద్ధుల ఆరోగ్య బీమా పథకం మైఖేల్‌కు వర్తిస్తుందని, ఈ మొత్తాన్ని అతను తన జేబులో నుంచి కట్టాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. దీంతో ఆ వృద్ధుడు ఊపిరి పీల్చుకున్నాడు.

Read More: 

బ్రేకింగ్: కరోనాతో ఎమ్మెల్యే గన్‌మెన్‌ మృతి

భారీగా కరోనా మరణాలు.. శవాలతో నిండిపోయిన అతిపెద్ద శ్మశాన వాటిక

దారుణం.. ఇంటర్ ఫెయిల్‌తో.. ముగ్గురు విద్యార్థినుల ఆత్మహత్య!

తెలంగాణ సచివాలయంలో మరో కరోనా కేసు.. ఉలిక్కిపడుతోన్న ఉద్యోగులు