కరోనా రోగుల అంత్యక్రియలను అడ్డుకుంటే మూడేళ్ల జైలు..

|

Apr 27, 2020 | 12:53 PM

కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న వేళ తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19తో మృతి చెందిన వారికి జరిగే అంత్యక్రియలను అడ్డుకోవడం కానీ, అంబులెన్స్ పై దాడి చేయడం, శ్మశానం వద్ద ఆందోళన లాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష విధించేలా పళణిస్వామి సర్కార్ కొత్త ఆర్డినెన్స్ ను అమలులోకి తీసుకొచ్చింది. ఇటీవల కరోనాతో రాష్ట్రంలో ఇద్దరు డాక్టర్లు మృతి చెందగా.. వార్డు బాయ్స్ సాయంతో వారికి అంత్యక్రియలు నిర్వహించాలని ఆసుపత్రి […]

కరోనా రోగుల అంత్యక్రియలను అడ్డుకుంటే మూడేళ్ల జైలు..
Follow us on

కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న వేళ తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19తో మృతి చెందిన వారికి జరిగే అంత్యక్రియలను అడ్డుకోవడం కానీ, అంబులెన్స్ పై దాడి చేయడం, శ్మశానం వద్ద ఆందోళన లాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష విధించేలా పళణిస్వామి సర్కార్ కొత్త ఆర్డినెన్స్ ను అమలులోకి తీసుకొచ్చింది.

ఇటీవల కరోనాతో రాష్ట్రంలో ఇద్దరు డాక్టర్లు మృతి చెందగా.. వార్డు బాయ్స్ సాయంతో వారికి అంత్యక్రియలు నిర్వహించాలని ఆసుపత్రి సిబ్బంది అనుకున్నారు. అయితే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వారిని తీసుకొచ్చే అంబులెన్స్ లపై దాడికి పాల్పడ్డారు. ఇక ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీనితో ప్రభుత్వం కరోనాతో పోరులో చనిపోయిన వారికి రూ. 50 లక్షల పరిహారాన్ని చెల్లిస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Read Also:

కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..

హమ్మయ్య.. కిమ్ బ్రతికే ఉన్నాడు.. అవన్నీ వట్టి ఫేక్!

డబ్బు కావాలంటే సరిహద్దుల్లో చేసే దొంగచాటు పనులు ఆపండి..