Third Wave: కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం సమాయత్తం.. రూ.23,123 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటన

| Edited By: Janardhan Veluru

Jul 09, 2021 | 11:03 AM

ఈ ఏడాది సెప్టెంబరులో కరోనా థర్డ్ వేవ్ భారతదేశాన్ని తాకనున్నట్లు నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Third Wave: కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం సమాయత్తం.. రూ.23,123 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటన
Union Health Minister Mansukh Mandaviya
Follow us on

Covid-19 Third wave: ఈ ఏడాది సెప్టెంబరులో కరోనా థర్డ్ వేవ్ భారతదేశాన్ని తాకనున్నట్లు నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోనేనందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. కేంద్రంలో ఏర్పడిన కొత్త కేబినెట్ ప్రధాని మోదీ అధ్యక్షతన తొలిసారిగా భేటీ అయింది. వ్యవసాయం, ఆరోగ్య రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సమావేశమైన కొత్త కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త కేబినెట్ ఆధ్వర్యంలో ఏర్పడిన తొలి మంత్రిత్వ భేటీలో తీసుకున్న నిర్ణయాల్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా వెల్లడించారు. మొదటి కేంద్ర మంత్రివర్గ సమావేశం తరువాత మీడియాతో మాట్లాడిన మాండవియా.. ప్రజారోగ్య దృష్ట్యా అత్యవసర ప్యాకేజీని ప్రకటించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ఎమర్జెన్సీ నిమిత్తం రూ.23 వేల 123 కోట్లను కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉపయోగిస్తాయని మంత్రి మాన్సుఖ్ తెలిపారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 736 జిల్లాల్లో కేంద్రం పిల్లల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కోవిడ్ సహాయ నిధి కింద దాదాపు 20,000 ఐసీయూ పడకలు సిద్ధంగా ఉంచామన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4 లక్షల 17 వేల 396 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయన్నారు. జిల్లా స్థాయిలో 10 వేల లీటర్ల ఆక్సిజన్ నిల్వ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. టెలి మెడిసిన్ ద్వారా వైద్యం అందించేందుకు చర్యల్ని వేగవంతం చేశామన్నారు.

ఏప్రిల్ 2020 లో, అత్యవసర కోవిడ్ స్పందన నిధిగా రూ .15 వేల కోట్లు కేటాయించాం. కోవిడ్ ఆసుపత్రులు 163 నుండి 4,389 కు పెరిగాయి. ఈ నిధిని ఉపయోగించి 8,338 కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,011 కోవిడ్ కేర్ సెంటర్లు అందుబాటు ఉన్నాయని మాండవియా తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని మంత్రి పిలుపునిచ్చారు. 9 నెలల కాలంలో దేశాన్ని కరోనా నుంచి విముక్తి కలిగిస్తామన్న కేంద్ర మంత్రి.. రాష్ట్ర ప్రభుత్వాలతో సమయన్వయంతో పనిచేస్తామన్నారు. ఈ మేరకు అయా రాష్ట్రాలకు సాధ్యమైనంతవరకు సహాయం అందిస్తామని మాండవియా తెలిపారు.

ఇదిలా ఉండగా, డాక్టర్ హర్ష్ వర్ధన్ స్థానంలో మాండవియా గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కరోనావైరస్ మహమ్మారితో దేశం పోరాడుతున్నందున అతని పోర్ట్‌ఫోలియో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంతకుముందు, ఆయన షిప్పింగ్ మంత్రిత్వ శాఖ స్వతంత్ర బాధ్యతను నిర్వహించారు. రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖను చేపట్టారు. 2016 న రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్,కెమికల్స్, ఎరువుల కేంద్ర సహాయమంత్రిగా ఆయనను కేంద్ర మంత్రివర్గంలో మొదటిసారి చేర్చారు. అంతకుముందు మాండవియా గుజరాత్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా పనిచేశారు.

Read Also… Zydus Vaccine: గుడ్ న్యూస్.. 18 ఏళ్లలోపు వారికి సెప్టెంబర్ నుంచి వ్యాక్సినేషన్.!