AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాక్సిన్‏ వచ్చినా.. ప్రమాదం తగ్గుతుందనుకుంటే పిచ్చితనమే.. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు

యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మొదలై సంవత్సరం పూర్తైంది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది

వ్యాక్సిన్‏ వచ్చినా.. ప్రమాదం తగ్గుతుందనుకుంటే పిచ్చితనమే.. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు
Ram Naramaneni
|

Updated on: Dec 04, 2020 | 10:06 AM

Share

యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మొదలై సంవత్సరం పూర్తైంది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం కృషి చేస్తున్నాయి. దాదాపు అన్ని దేశాల వ్యాక్సిన్ ప్రయోగాలు పరీక్షలు తుదిదశలో ఉన్నాయి. అయితే ఫైజర్ టీకాను అత్యవసర వినియోగం కోసం యూకే ఆమోదం తెలిపింది. కరోనా వ్యాక్సిన్ పై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెెస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఐరాస సాధారణ సభ సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. “కరోనా వైరస్ కొన్ని దశాబ్ధాలపాటు ఉంటుందని అన్నారు. కరోనా మొదలై దాదాపు ఏడాది పూర్తైంది. 1945 తర్వాత యావత్ ప్రపంచానికి మొదటి సారి ఉమ్మడి ప్రమాదం ఏర్పడింది. ఈ వైరస్ ప్రభావం ఇప్పట్లో తగ్గదు. వ్యాక్సిన్ వచ్చిన కరోనా మాయమైపోతుందని అనుకుంటే పిచ్చితనమే.. కాలమే దీనికి పరిష్కారం చూపుతుంది. వ్యాక్సిన్ మన దగ్గర ఉన్న ఇతర సాధనాలను పూర్తి చేస్తుంది.. కానీ, వాటిని తొలగించదు” అని తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ కోసం కృషి చేసిన ప్రతీ శాస్త్రవేత్తకు ధన్యవాదలు చెప్పుకుంటున్నానని తెలిపారు. కానీ వ్యాక్సిన్ వచ్చిన కరోనా నుంచి ప్రమాదం తప్పదని, దీని ప్రభావం సంవత్సరాల తరబడి ఉంటుందని గుటెర్రెస్ హెచ్చరించారు.

కరోనా వలన ప్రపంచం మొత్తం ఆర్థికంగా, ఆరోగ్యంగా తీవ్రంగా నష్టపోయిందని, తిరిగి మాములు స్థితికి రావడానికి కాస్త సమయం పడుతుందని గుటెర్రెస్ చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, కాబట్టి ప్రజలంతా కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు.