తెలుగు రాష్ట్రాల్లో విల‌యం సృష్టిస్తోన్న క‌రోనా..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ..

తెలుగు రాష్ట్రాల్లో విల‌యం సృష్టిస్తోన్న క‌రోనా..

Edited By:

Updated on: Jul 10, 2020 | 7:45 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. గురువారం 1555 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

అలాగే ఇవాళ ఒక్క రోజే 13 మంది మృతి చెందారు. క‌ర్నూలులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, అనంత‌పూర్‌లో ఇద్ద‌రు, ప్ర‌కాశంలో ఇద్ద‌రు, కృష్ణ‌లో ఒక‌రు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఒక‌రు, చిత్తూరులో ఒక‌రు కోవిడ్‌తో మరణించారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 23814కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 277 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం 11383 క‌రోనా యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 12154 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక తెలంగాణలో గురువారం 1,410 కరోనా కేసులు నమోదు కాగా ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం 331 మంది చనిపోయారు. మొత్తం 30,946 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంకా 12,423 యాక్టివ్ కేసులున్నాయి. గురువారం 913 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 18,192 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. కరోనా కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది.

Read More:

తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, మాజీ మంత్రి రామ‌స్వామి మృతి..