రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభించిన విషయం తెలిసిందే. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఓ రేంజ్‌లో నమోదు అయ్యేవి. అయితే గత కొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గిపోయాయి. కానీ ఒక్కో రోజు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయనికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9544 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,34,940కు చేరింది. ఇందులో 87803 యాక్టివ్ కేసులు ఉండగా.. 244045 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా 91 మంది వైరస్ కారణంగా మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 3092కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 8,827 మంది కరోనాను జయించారు.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1312 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత పశ్చిమ గోదావరిలో 1131, చిత్తూరులో 1103, కర్నూలులో 919 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు అనంతపురంలో 704, గుంటూరులో 358, కడపలో 343, కృష్ణాలో 265, నెల్లూరులో 761, ప్రకాశంలో 797, శ్రీకాకుళంలో 571, విశాఖపట్నం 738, విజయనగరంలో 542 కేసులు వచ్చాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి.
ఇక తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1,967 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. 1,781 మంది వ్యాధి బారి నుంచి కోలుకోని డిశ్చార్జి అయ్యారు. కాగా ఇప్పటివరకు మొత్తం కరోనా సోకినవారి సంఖ్య 99,391 చేరినట్టు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. ఇప్పటివరకు కరోనా నుంచి 76,967మంది కోలుకున్నట్లు వివరించింది. కాగా తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 21,687 యాక్టివ్ కేసులున్నాయి. మృతుల సంఖ్య 737 కి చేరింది.
Read More:
ఇలా చేస్తే అంతే! పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్
ఎమ్మెల్యే రోజా, సెల్వమణి దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన ఆలీ కూతురు.. మా గంగానదిగా!