Revanth Reddy Covid: రేవంత్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌.. స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించిన టీపీసీసీ చీఫ్..

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు.

Revanth Reddy Covid: రేవంత్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌.. స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించిన టీపీసీసీ చీఫ్..
Revanth Reddy

Edited By: Anil kumar poka

Updated on: Jan 03, 2022 | 3:46 PM

Revanth Reddy Tests Positive: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఆయన రచ్చబండ కార్యక్రమంతో పాటు బాధిత రైతు కుటుంబాలను పరామర్శించడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే హౌస్ అరెస్ట్‌లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు రేవంత్ ఇంటికి రావడం, ఆయనను కలవడం వంటివి జరుగుతున్నాయి. స్వల్ప లక్షణాలతో నేను కోవిడ్ బారిన పడ్డాను. గత కొద్ది రోజులుగా నన్ను కాంటాక్ట్ అయినవారు.. తప్పనిసరిగా కావల్సిన జాగ్రత్తలు తీసుకోండి అని ట్వీట్ చేశారు.

ఆదివారం నుంచి జ్వరంతోపాటు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని రేవంత్ ట్విటర్​లో వెల్లడించారు. ఈ లక్షణాలతో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొవిడ్ మహమ్మారి, ఒమిక్రాన్ వేరింట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రేవంత్ కోరారు. ప్రస్తుతం తను ఆరోగ్యంగానే ఉన్నానని ట్వీట్ చేశారు. గతేడాది మార్చిలోనూ రేవంత్​కు కరోనా సోకింది.
ఇవి కూడా చదవండి: Curry Leaf: అమ్మో..! కరివేపాకు కిలో రూ. 175.. గ్రేటర్‌లో చుక్కలు చూపిస్తున్న ధర..

Viral Video: కుందేలపై మరోసారి గెలిచిన తాబేలు.. ఇది కథకాదు నిజం.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు..