క‌రోనా నుంచి కోలుకున్న డైరెక్ట‌ర్‌ రాజ‌మౌళి కుటుంబం

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజ‌మౌళి కోవిడ్ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఆయ‌న‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా క‌రోనాను జ‌యించారు. ఇటీవ‌లే క‌రోనా వైర‌స్ సోక‌డంతో.. రాజ‌మౌళి కుటుంబం మొత్తం రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉన్నారు. హోమ్ క్వారంటైన్ పూర్తి అవ్వ‌డంతో..

క‌రోనా నుంచి కోలుకున్న డైరెక్ట‌ర్‌ రాజ‌మౌళి కుటుంబం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 12, 2020 | 6:09 PM

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజ‌మౌళి కోవిడ్ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఆయ‌న‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా క‌రోనాను జ‌యించారు. ఇటీవ‌లే క‌రోనా వైర‌స్ సోక‌డంతో.. రాజ‌మౌళి కుటుంబం మొత్తం రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉన్నారు. హోమ్ క్వారంటైన్ పూర్తి అవ్వ‌డంతో మ‌రోసారి టెస్ట్ చేయించుకున్నారు. అందులో అంద‌రికీ నెగిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని రాజమౌళి ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. త‌నతో పాటు కుటుంబ స‌భ్యులు కూడా కోవిడ్ నుంచి కోలుకున్న విష‌యాన్ని ఆయ‌న ఆ ట్వీట్‌లో వెల్ల‌డించారు. అలాగే ప్లాస్మా దానం గురించి కూడా చెబుతూ.. త‌మ‌ను వైద్యులు మూడు వారాలు వేచి చూడ‌మ‌న్నార‌ని, ఆ లోగా శ‌రీరంలో అవ‌స‌ర‌మైన యాంటీ బాడీస్ వృద్ధి చెందితే ప్లాస్మా దానం చేయ‌డానికి ముందుకొస్తామ‌ని రాజ‌మౌళి పేర్కొన్నారు. ఇటీవ‌ల కోవిడ్‌-19 సోక‌డంతో క్వారంటైన్‌లోకి వెళ్లింది రాజ‌మౌళి కుటుంబం.

Read More:

బాలీవుడ్ ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడి ఆరోగ్యం విష‌మం

క‌రోనాతో మ‌ర‌ణించిన మాజీ ఎమ్మెల్యే మ‌న‌వ‌ళ్లు