కరోనా వైరస్‌తో హీరో తండ్రి మృతి.. విషాదంలో కుటుంబం
ఈ రోజుల్లో ఫేం హీరో శ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి మంగం వెంకట దుర్గా రాంప్రసాద్ కోవిడ్ మహమ్మారి బారిన పడి కన్ను మూశారు. గత 20 రోజులుగా విజయవాడలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ..
![కరోనా వైరస్‌తో హీరో తండ్రి మృతి.. విషాదంలో కుటుంబం](https://images.tv9telugu.com/wp-content/uploads/2020/07/hero.jpg?w=1280)
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే కదా. దీంతో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే పలు రాష్ట్రంలోని కంటైన్‌మెంట్ జోన్‌లలో జులై 31 వరకూ లాక్‌డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి ప్రభుత్వాలు. ఇక పలువురు ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, నటులపై కూడా ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
తాజాగా.. ఈ రోజుల్లో ఫేం హీరో శ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి మంగం వెంకట దుర్గా రాంప్రసాద్ కోవిడ్ మహమ్మారి బారిన పడి కన్ను మూశారు. గత 20 రోజులుగా విజయవాడలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ.. బుధవారం రాత్రి 8.30 గంటలకు తుది శ్వాస విడిచారు. కాగా దుర్గా రాం ప్రసాద్ మృతితో కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. శ్రీ తండ్రి మృతికి పలువురు టాలీవుడ్ నటులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా ప్రముఖ డైరెక్టర్ మారుతి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ రోజుల్లో సినిమాతో శ్రీ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శ్రీ లవ్ సైకిల్, పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ వంటి సినిమాల్లో నటించాడు.
Read More:
భారత ఆర్మీ సంచలన నిర్ణయం.. 89 యాప్‌లు బ్యాన్..
కరోనాకు చెక్ పెట్టేందుకు తక్కువ ధరకే మరో జనరిక్ మెడిసిన్..