Balaiah on Anandayya : ఆనందయ్య కరోనా మందుపై టాలీవుడ్ నటుడు, టీడీపీ నేత బాలకృష్ణ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, పలు దక్షిణాది రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన ఆనందయ్య కరోనా మందుపై తెలుగు సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ..

Balaiah on Anandayya :  ఆనందయ్య కరోనా మందుపై టాలీవుడ్ నటుడు, టీడీపీ నేత బాలకృష్ణ కామెంట్స్
Balaiah

Updated on: May 28, 2021 | 9:39 AM

Balakrishna comments on Anandayya medicine : ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, పలు దక్షిణాది రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన ఆనందయ్య కరోనా మందుపై తెలుగు సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ఇవాళ దివంగత ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని అంజలి ఘటించిన అనంతరం బాలయ్య ఆనందయ్య మందుపై తనదైన శైలిలో కామెంట్ చేశారు. “నాకు నమ్మకం ఉందయ్యా.. అభిమానం లేనిదే ఆరాధన లేదు.. ఆరాధన లేనిదే మతం లేదు. మతం లేనిదే మానవుడే లేడు. అలాగే ప్రతీది ఒక నమ్మకం.. నేను నమ్ముతాను తప్పకుండా… ఎందుకంటే, గొప్పగొప్ప వైద్యులున్నారు. క్రీస్తు పూర్వమే సుశంకుడనే వైద్యుడుండే వాడు.. ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో ఇవాళ్టికి కూడా రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జరీ లో ఆయన పేరుంది” అని బాలయ్య వ్యాఖ్యానించారు.

Read also : Etela : ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులకు హైకోర్టులో చుక్కెదురు, జమున హేచరీస్ భూముల్లో సర్వే నిలుపుదలకు ధర్మాసనం నో