తిరుపతిలో కరోనా టెన్షన్.. మర్కజ్ ఇష్యూ ఒక వైపు.. ఇస్తేమా సమస్య మరోవైపు..!

| Edited By:

Apr 02, 2020 | 2:07 PM

ఏపీలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓ వైపు రాష్ట్రంలో మర్కజ్‌ మీటింగ్‌లకు హాజరైన వారిని గుర్తిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశాలు ఏపీ నుంచి కూడా వెళ్లి రావడంతో వారిలో పలువురికి ఈ వైరస్ ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో తిరుపతి కార్పోరేషన్ మొత్తం అప్రమత్తమైంది. గత మార్చి 13 నుంచి 22 […]

తిరుపతిలో కరోనా టెన్షన్.. మర్కజ్ ఇష్యూ ఒక వైపు.. ఇస్తేమా సమస్య మరోవైపు..!
Follow us on

ఏపీలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓ వైపు రాష్ట్రంలో మర్కజ్‌ మీటింగ్‌లకు హాజరైన వారిని గుర్తిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశాలు ఏపీ నుంచి కూడా వెళ్లి రావడంతో వారిలో పలువురికి ఈ వైరస్ ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో తిరుపతి కార్పోరేషన్ మొత్తం అప్రమత్తమైంది. గత మార్చి 13 నుంచి 22 వరకు ఢిల్లీ నుంచి తిరుపతికి అన్ని ట్రైన్‌లలో చేరుకున్నప్రయాణికుల వివరాలు సేకరించారు. ముఖ్యంగా జమాత్ సమావేశాలకు వెళ్లిన వారి కోసం ఇంటింటి సర్వే కొనసాగుతోంది. తిరుపతి నుంచి ఢిల్లీ తబ్లిగీ జమాత్‌కు ఆరుగురు
వెళ్లినట్లు గుర్తించారు. ఇక పాజిటివ్ కేసు నమోదైన త్యాగరాజు నగర్‌ ప్రాంతంలోని ఆరువార్డులను రెడ్‌జోన్‌లుగా ప్రకటించారు. అక్కడ ఉన్న 80వేల ఇళ్లను ఇంటింటి సర్వే చేస్తున్నట్లు తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా తెలిపారు. రెండు కిలోమీటర్ల వరకు రాకపోకలపై ఆంక్షలు విధించామని. పోలీసులు కార్డన్‌ సర్చ్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే.. అస్సాంలో జరిగిన ఇస్తేమాతో కూడా ఈ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. గత మార్చి నెలలో 18,19 తేదీల్లో అస్సాం రాష్ట్రంలోని గోల్‌పరాలోని మసీదులో జరిగిన ఇస్తెమాకు తిరుపతి నుంచి కొందరు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అస్సాంకు ఎవరెవరు వెళ్లి వచ్చిన వారిని గుర్తించే పనిలో పడింది ప్రభుత్వం.
చిత్తూరు జిల్లా పలమనేరు, గంగవరం నుంచి అస్సాంకు 12 మంది వెళ్లారని.. వారిలో ముగ్గురికు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. పాజిటివ్ వచ్చిన ముగ్గురు కూడా అస్సాం వెళ్లి వచ్చిన వారేనని అధికారులు తేల్చారు. అంతేకాదు..బెంగుళూరు, చెన్నైలలో జరిగిన సభలలో కూడా మరో 121 మంది పాల్గొన్న వారిని అధికారులు గుర్తించారు. వీరందరి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు అధికారులు.