తిరుపతి ఎమ్మెల్యే భూమనకు రెండోసారి కరోనా పాజిటివ్
చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు తిరుపతి వైద్యాధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గడంలేదు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే ప్రజా ప్రతినిధులు కరోనా రాకాసి కోరల్లో చిక్కుకుంటున్నారు. వారిని ఆస్పత్రులకే పరిమితం చేస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు తిరుపతి వైద్యాధికారులు తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో బుధవారం నిర్వహించిన పరీక్షలో మరోసారి ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్య సిబ్బంది. గురువారం మరోసారి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకుని తదుపరి వైద్యసేవలు పొందనున్నారు. ఆగస్టు నెలలో కాస్త అస్వస్థతకు గురైన కరుణాకర్‌రెడ్డికి పరీక్షలు నిర్వహించగా, కరోనా సోకనట్లు తేలింది. దీంతో ఆయన రుయా ఆస్పత్రిలో వైద్యసేవలు పొంది డిశ్ఛార్జయ్యారు. కాగా, భూమన కుమారుడికి కూడా రెండోసారి కరోనా పాజిటివ్ రావడంతో రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.