Third Wave Threat across the country remedies by experts: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ (CORONA VIRUS SECOND WAVE)ఓ వైపు కొనసాగుతుండగా.. థర్డ్ వేవ్ టెన్షన్ వణికిస్తోంది. గత పదిహేను రోజులుగా థర్డ్ వేవ్ ఖాయమన్న విశ్లేషణలు, కథనాలు మీడియాలో ఎక్కువయ్యాయి. దాంతో సెకెండ్ వేవ్ ఇంత భయంకరంగా వుంటే.. థర్డ్ వేవ్ మరెంతటి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుందో.. ఎందరి ప్రాణాలను హరిస్తుందోనన్న టెన్షన్ తీవ్రమవుతోంది. థర్డ్ వేవ్ గురించిన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వైద్య నిపుణులు, వైద్య వర్గాలు.. అది చిన్నారులపైనా, యువకులపైనా ఎక్కువ ప్రభావం చూపుతుందన్న అంఛనాలను వెల్లడిస్తున్నారు. ఈనేపథ్యంలో అందరిలోను వణుకుపుడుతోంది.
దేశంలో 2020 మార్చి నెలలో కరోనా వైరస్ (CORONA VIRUS) విలయతాండవం మొదలై.. సెప్టెంబర్ నెల నాటికి తీవ్ర రూపం దాల్చింది. తొలి వేవ్‌లో అత్యధికంగా సెప్టెంబర్ 19న 97 వేల కరోనా కేసులు ఒక్కరోజులో నమోదయ్యాయి. సెప్టెంబర్ తర్వాత క్రమంగా కరోనా ప్రభావం తగ్గుతూ రావడంతో వైరస్ ప్రమాదం తొలగిపోయిందన్న అభిప్రాయానికి అటు ప్రభుత్వాలు, ఇటు సామాన్యులు వచ్చేశారు. అక్కడే అందరు పప్పులో కాలేశారు. యుకే (UK)లో మొదలైన సెకెండ్ వేవ్ నిరాటంకంగా తిరుగుతున్న విమానాల ద్వారా ముంబై (MUMBAI)లో ప్రవేశించింది. మహారాష్ట్ర (MAHARASHTRA)ను సెకెండ్ వేవ్ ముంచెత్తిన నెల రోజులకు మిగిలిన రాష్ట్రాలకు పాకింది. దీన్ని సెకెండ్ వేవ్‌గా ప్రభుత్వాలు గుర్తించగా.. సెకెండ్ వేవ్‌లో మ్యూటెంట్ (MUTANT VIRUS) అయిన వైరస్‌ను బీ1.617 (B.1.617)గా శాస్త్రవేత్తలు తేల్చారు.
మ్యూటెంట్ అయిన కరోనా వైరస్ మన దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ఏప్రిల్, మే నెలల్లో కరోనా మరణ మృదంగాన్ని మోగించింది. సోకినట్లు తెలిసినట్లు తేలగానే ప్రాణాలను కబళించింది. రోజుల వ్యవధిలో ఎందరో మృత్యువాత పడ్డారు. ఒక్కో ఇంట్లో ముగ్గురు, నలుగురిని కరోనా వైరస్ పొట్టనబెట్టుకుంది. ఓ వారం, పది రోజుల పాటు దేశంలో ప్రతీ రోజు నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు (CORONA CASES) నమోదయ్యాయి. దాదాపు ప్రతీ రోజు 6 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య ప్రతీరోజు లక్ష.. లక్షన్నరకు మధ్యలో నమోదవుతుండగాా.. మరణాల సంఖ్య మూడువేల మార్కుకు కాస్త అటు ఇటుగా రికార్డవుతోంది. ఈక్రమంలోనే థర్డ్ వేవ్ టెన్షన్ దేశాన్ని కుదిపేస్తోంది.
సెకెండ్ వేవ్ జూన్ నెలాఖరు లేదా జులై మొదటివారంలో ముగుస్తుందని అంఛనా వేస్తున్న నిపుణులు.. ఆ తర్వాత మూడు, నాలుగు నెలలకు థర్డ్ వేవ్ మొదలవుతుందంటున్నారు. అయితే.. మూడు విషయాలపై మనమంతా ఫోకస్ చేస్తే.. థర్డ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించగలమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా దేశంలో మొదలైనప్పట్నించి ప్రతీ ఒక్కరు చెబుతున్నవి.. చెబుతుంటే చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నవి మూడు అంశాలున్నాయి. వాటినే కాస్త పక్కాగా పాటిస్తే.. కఠినతరమైన లాక్‌డౌన్లు లేకుండా థర్డ్ వేవ్ కరోనా థ్రెట్ (CORONA THIRD WAVE THREAT) నుంచి తప్పించుకోవచ్చని.. థర్డ్ వేవ్ తాకిడిని మినిమైజ్ చేయవచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మాస్కు (MASK) ధరించడం.. వీలైతే… డబుల్ మాస్కు (DOUBLE MASK)లు ధరించడం ద్వారా థర్ద్ వేవ్‌ని నియంత్రించవచ్చంటున్నారు. శానిటైజర్లు (SANITIZERS) మరింతగా వాడడం, సోషల్ డిస్టెన్సు (SOCIAL DISTANCE) పాటించడం అనివార్యమంటున్నారు.
అయితే థర్డ్ వేవ్ ప్రబావం చిన్నారులు, యువకులపై పడే అవకాశం వుండడంతో మరిన్ని సలహాలు ఇస్తున్నాయి వైద్య వర్గాలు. చిన్నారులకు చికిత్స అందించేందుకు ప్రస్తుతం దేశంలో వైద్య వసతులు పరిమితంగా వున్నాయి. ప్రభుత్వాలు ఇప్పట్నించే ఈ విషయంపై శ్రద్ధ చూపితే.. చిన్నారులకు వైద్యమందించే సౌకర్యాలను గణనీయంగా పెంచుకునే అవకాశం వుంటుంది. అదే సమయంలో చిన్నారులకు అవసరమైన వైద్య పరికరాలు, మెడిసిన్స్ ఉత్పత్తిని ఇప్పట్నించే పెంచుకుంటే థర్డ్ వేవ్ మొదలైనా.. ఆదిలోనే దానికి అంతం పలకవచ్చంటున్నారు. ఇదే సమయంలో దేశంలో వ్యాక్సినేషన్ (VACCINATION) ప్రక్రియను మరింత వేగవంతం చేయడం.. థర్డ్ వేవ్ మొదలవుతుందని భావిస్తున్న సెప్టెంబర్, అక్టోబర్ నాటికి దేశంలో కనీసం 70 శాతం జనాభాకు వ్యాక్సిన్ చేరితే.. థర్డ్ వేవ్ టెన్షన్ నుంచి బయట పడొచ్చని వైద్య వర్గాలంటున్నాయి. మ్యూటెంట్ అయిన కరోనా వైరస్‌కు అనుగుణంగా వ్యాక్సిన్లను అప్ గ్రేడ్ చేసుకోవాల్సి అవసరాన్ని కూడా వారు నొక్కి చెబుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చిన్నారుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాష్ట్రాలకు జారీ చేసిన విసయం తెలిసిందే. ఆ మేరకు చర్యలకు పలు రాష్ట్రాలు ఉపక్రమించాయి కూడా.
ALSO READ: శతాబ్ధాల చరిత్ర.. దశాబ్ధాల నిర్లక్ష్యం.. వెరసి జలరవాణాకు బ్రేక్