Third Covid wave: సంక్రాంతి తర్వాత కరోనా థర్డ్ వేవ్.. కానీ, భయపడొద్దు.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

|

Dec 30, 2021 | 3:15 PM

ఒమిక్రాన్ వరమా.. శాపమా? ఒమిక్రాన్ వ్యాప్తి మంచికేనా ! కన్‌ఫ్యూజన్ ఏమీలేదు. థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌తోనే. ఒమిక్రాన్ వేరియంట్ కొత్తదే.. కానీ, డేంజర్ కాదు. ఒమిక్రాన్ థర్డ్ వేరియంటే.. కానీ భయం లేదు. కేసులు పెరుగుతాయి..

Third Covid wave: సంక్రాంతి తర్వాత కరోనా థర్డ్ వేవ్.. కానీ, భయపడొద్దు.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు
Dr G Srinivasa Rao
Follow us on

ఒమిక్రాన్ వరమా.. శాపమా? ఒమిక్రాన్ వ్యాప్తి మంచికేనా ! కన్‌ఫ్యూజన్ ఏమీలేదు. థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌తోనే. ఒమిక్రాన్ వేరియంట్ కొత్తదే.. కానీ, డేంజర్ కాదు. ఒమిక్రాన్ థర్డ్ వేరియంటే.. కానీ భయం లేదు. కేసులు పెరుగుతాయి.. కానీ బతుకుతాం. జస్ట్ ఆరంటే ఆరేనెలల్లో కరోనా విముక్త ప్రపంచాన్ని చూస్తామని  తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రపంచంలో కరోనా కేసులు లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్నాయి. వేవ్‌1, వేవ్‌ 2తో పోల్చితే ఒమిక్రాన్ వేరియంట్.. 30శాతం వేగంగా వ్యాపిస్తోంది.

అమెరికాలో అయితే ఒక్కరోజులో 5లక్షల కేసులు వస్తున్నాయంటే.. వ్యాప్తి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో ఇండియాలో, అందులోనూ తెలంగాణలోనూ ఉంటుందీ అంటున్నారు శ్రీనివాసరావు.

మరికొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరం రాబోతోంది. ఆ వెంటనే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగు సంక్రాంతీ వచ్చేస్తుంది. వేడుకలుంటాయి.. రాకపోకలు పెరుగుతాయి. ఫలితంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇదిలావుంటే.. రాబోయే 3, 4 వారాలు యమా డేంజర్‌ అని హెచ్చరిస్తున్నారు.

ఈ భయంతో పాటే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్, కరోనాతో అల్లాడుతున్న ప్రపంచానికి కొండంత ఆశని పుట్టిస్తోంది. థర్డ్ వేవ్ రూపంలో వచ్చిన ఒమిక్రాన్ తో పూర్తిగా కరోనా అంతమైపోతుందంటున్నారు తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు .

మాస్కే రక్ష.

భయం లేదు. బతికేస్తాం. కానీ… జాగ్రత్త ముఖ్యం. ముక్కు, నోటికి మాస్క్‌ ముఖ్యం. ఒక్క తెలంగాణలోనే కేసులు పదుల్లో వందల్లో కాదు.. వేలల్లో ఉంటాయి. కచ్చితంగా ఆ నెంబర్ చూస్తాం. కానీ భయంలేదు. ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉంది. ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్స్, కావల్సినన్ని బెడ్స్‌, అవసరమైతే ఆక్సీజన్ రెడీ. అయినా కూడా.. మాస్కే మాత్రం తీయొద్దని హెచ్చరిస్తున్నారు .

ఇవి కూడా చదవండి: PM Narendra Modi: మార్పు అందుకే చేశాం.. ప్రధాని కొత్త కారుపై కీలక వివరాలు వెల్లడించిన ప్రభుత్వ వర్గాలు