కరోనాతో పోరాడేందుకు ఈ ఫుడ్ టిప్స్ మీకోసమే

బాడీలోని ఇమ్యూనిటీ పవర్ ముందు వైరస్ పవర్ తేలిపోవాలి. అందుకోసం ఏం తినాలో తెలుసుకుందాం. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు కూడా చెబుతూనే ఉన్నారు. అయినా టీవీ9 ప్రత్యేకంగా మీకోసం మరోసారి..

కరోనాతో పోరాడేందుకు ఈ ఫుడ్ టిప్స్ మీకోసమే
Follow us

| Edited By:

Updated on: Apr 15, 2020 | 5:29 PM

ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో తెలిసిన విషయమే. లాక్‌డౌన్‌ను విధించిన తరువాత కూడా విస్తరిస్తూనే ఉంది. ఒకసారి నెగిటివ్ వచ్చిన తరువాత కూడా మళ్లీ పాజిటివ్ వస్తున్నాయన్న వార్తలు చదువుతూనే ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది ఎంత ప్రమాదకరమైన వ్యాధో. మనకు రాదని ఈజీగా తీసుకోకుండా.. ఇప్పటికైనా సరైనా ప్రికాషన్స్ పాటిస్తూ ఉండటం మంచిది. అలాగే.. ఒకవేళ కరోనా వచ్చినా దానితో పోరాడేందుకు మరింత బలంగా ఉండాలి. వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుకోవాలి. దీంతో ఎంతో బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. మన ఇళ్లల్లో దొరికే వాటితోనే పౌష్టికాహారాన్ని తయారు చేసుకోవచ్చు.

మన బాడీలోని ఇమ్యూనిటీ పవర్ ముందు వైరస్ పవర్ తేలిపోవాలి. అందుకోసం ఏం తినాలో తెలుసుకుందాం. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు, వైద్యులు కూడా చెబుతూనే ఉన్నారు. అయినా టీవీ9 ప్రత్యేకంగా మీకోసం మరోసారి తెలుపుతుంది. సూక్ష్మక్రిములైన కోవిడ్‌తో పోరాడేందుకు విటమిన్లు ఏ, బీ, సీ, డీ, ఈతో పాటు.. మినరల్స్ ఐరెన్, సెలెనియం, జింక్ తప్పనిసరిగా ఉండాలి.

1. మటన్, చికెన్, గుడ్లును బాగా ఉడికించి తీసుకోవాలి 2. క్యారెట్లు, టమాటాలు, క్యాప్సికం, పప్పులు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటి వల్ల పొటాషియం, బి6, బి1, బి2 విటమిన్స్ లభ్యమవుతాయి 3. అప్పుడప్పుడు, నిమ్మ, అల్లం, వెల్లుల్లి, పుదీన, తులసి రసాలు తీసుకోవడం మంచిది 4. అందులోనూ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వేడి చేసే ఆహారానికి బదులు.. చలవ చేసేవి ఎక్కువగా తీసుకోవడం మంచిది 5. వీలైనంతవరకూ బాదం, జీడి పప్పు తినాలి. అలాగే పాలు, జ్యూస్‌లు తాగడం బెటర్ 6. తినే ప్రతీదీ శుభ్రంగా కడిగి తీసుకోవడం ఉత్తమం 7. కాగా లాక్‌డౌన్ సమయం కాబట్టి ఆర్థికంగా కాస్త ఇబ్బంది ఉండొచ్చు. అలాంటప్పుడు వీలైనంతవరకూ కూరగాయలు, ఆకు కూరలు, నిమ్మ రసం తీసుకోవచ్చు. అలాగే ఆరారగా నీళ్లు తాగడం మంచిది.

Learn More:

లాక్‌డౌన్‌లో అదే పని.. పోర్న్ చూడటంలో భారత్ ఫస్ట్ ప్లేస్

బ్రేకింగ్: వికారాబాద్‌లో వారం రోజుల పాటు సకలం బంద్.. కలెక్టర్‌ సంచలన నిర్ణయం

కరోనా కట్టడి: జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారులు వీళ్లే