AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా విధులు త‌ట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

క‌రోనా క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ విధులు నిర్వ‌హిస్తున్న వైద్య‌సిబ్బంది, శానిటేష‌న్ వ‌ర్క‌ర్లు, పోలీసుల క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతంగా మారాయి..విధి నిర్వ‌హ‌ణ‌లో

క‌రోనా విధులు త‌ట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
Jyothi Gadda
|

Updated on: Apr 15, 2020 | 9:53 AM

Share
క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టిస్తోన్న విల‌యం అంతాఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లుతో ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. విద్యా,ఉద్యోగ‌, ర‌వాణా రంగాలు స్తంభించిపోయాయి. దేశ ఆర్థిక ప‌రిస్థితి పాతాళానికి ప‌డిపోతోంది. రెక్కాడితే గానీ, డొక్కాడ‌ని నిరుపేద‌ల క‌ష్టాలు ఇక చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇదిలా ఉంటే, క‌రోనా క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ విధులు నిర్వ‌హిస్తున్న వైద్య‌సిబ్బంది, శానిటేష‌న్ వ‌ర్క‌ర్లు, పోలీసుల క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతంగా మారాయి. రాత్ర‌న‌క ప‌గ‌ల‌న‌క డ్యూటీ చేస్తున్న పోలీస్ సిబ్బంది ఒత్తిడి త‌ట్టుకోలేక పోతున్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఓ పోలీసు ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. వివ‌రాల్లోకి వెళితే…
పోలీసు ఉద్యోగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో విదుల ఒత్తిడి తట్టుకోలేక కానిస్టుబుల్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు.  లాక్ డౌన్ విధించినప్పటి నుంచి విధుల‌లో ఉన్న కానిస్టేబుల్ ఒకరు ఒత్తిడి తట్టుకోలేక తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. భోపాల్ లో విధి నిర్వహణలో ఉన్న చేతన్ సింగ్ అనే కానిస్టుబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ కానిస్టేబుల్‌ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన కోలుకుంటున్నారు.

Follow Us
ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్‌ టీ.. కారణం ఇదే
ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్‌ టీ.. కారణం ఇదే
కుర్రాళ్లకు తెగ నచ్చిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస
కుర్రాళ్లకు తెగ నచ్చిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస
తిరుమల వెళుతున్నారా..? పలు రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..
తిరుమల వెళుతున్నారా..? పలు రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..
ఇడ్లీ వర్సెస్ దోశ.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్‌..
ఇడ్లీ వర్సెస్ దోశ.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్‌..
సర్కార్ బడి పిల్లలకు బంపర్ గిఫ్ట్.. ఈ ఏడాది నుంచి భారీ మార్పులు!
సర్కార్ బడి పిల్లలకు బంపర్ గిఫ్ట్.. ఈ ఏడాది నుంచి భారీ మార్పులు!
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో