రష్యాలో పెరుగుతున్న కేసులు.. తాజాగా నమోదైన వివరాలు ఇవే..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్యతో పాటుగా.. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 30లక్షలకు చేరుకున్నాయి. ఇక వీరిలో దాదాపు రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రపంచ దేశాలన్నింటిని టచ్ చేసింది. ఇక రష్యాలో కూడా ఈ మహమ్మారి రోజురోజుకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక్కడ తాజాగా మరో 6,361 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇన్నీ కేసులు కేవలం 24 […]

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్యతో పాటుగా.. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 30లక్షలకు చేరుకున్నాయి. ఇక వీరిలో దాదాపు రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రపంచ దేశాలన్నింటిని టచ్ చేసింది. ఇక రష్యాలో కూడా ఈ మహమ్మారి రోజురోజుకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక్కడ తాజాగా మరో 6,361 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇన్నీ కేసులు కేవలం 24 గంటల్లోనే నమోదయ్యాయి. దీంతో ఇప్పుడు దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80,949కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 66మంది ప్రాణాలు విడిచారు. దీంతో రష్యాలో కరోనా బారినపడి చనిపోయిన వారి సంఖ్య 747కి చేరింది. ఈ విషయాన్ని రష్యాలోని కరోనా క్రైసిస్ రెస్పాన్స్ టీం ఆదివారం వెల్లడించింది. అయితే ఇక్కడ కరోనా కేసులు ఏప్రిల్ నుంచే మొదయ్యాయి. ఇంతలోనే ఇన్ని కేసులు నమోదవ్వడంతో రష్యా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది.